నీతి ఆయోగ్ నూతన సీఈవోగా బీవీఆర్ సుబ్రహ్మణ్యం
- February 21, 2023
న్యూ ఢిల్లీ: నీతి ఆయోగ్ కొత్త సీఈఓగా తెలుగు అధికారి బీవీఆర్ సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. పరమేశ్వరన్ అయ్యర్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. అయ్యర్ ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వెళ్లనున్నారు. హర్యానా కేడర్ ఐఏఎస్ అధికారి రాజేష్ ఖుల్లార్ స్థానంలో అయ్యర్ నియామకం కానున్నారు. 1988 బ్యాచ్ IAS అధికారి అయిన ఖుల్లార్ సెప్టెంబర్ 2020లో ప్రపంచ బ్యాంకుకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
నీతి ఆయోగ్‌లో అయ్యర్ స్థానంలో బాధ్యతలు తీసుకోనున్న బీవీఆర్ సుబ్రహ్మణ్యం 1987 బ్యాచ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఈయన 2004-2008, 2012-2015 మధ్య ప్రధానమంత్రులు మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీ వద్ద కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శిగా పనిచేశారు. అంతేకాకుండా సుబ్రహ్మణ్యం జమ్మూ మరియు కాశ్మీర్ ప్రధాన కార్యదర్శిగా మరియు ప్రధానమంత్రి కార్యాలయంలో డైరెక్టర్ మరియు జాయింట్ సెక్రటరీగా పనిచేశారు.
బీవీఆర్ సుబ్రహ్మణ్యం పూర్తి పేరు భమిడిపాటి వెంకట రామసుబ్రహ్మణ్యం. ఈయన తండ్రి ఒడిశాకు, తల్లి ఆంధ్రాకు చెందినవారు. సుబ్రహ్మణ్యం ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో మెకానికల్ బ్రాంచ్ లో బీటెక్ చేశారు. తర్వాత ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. అనంతరం లండన్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా కూడా పొందారు. లాల్‌బహదూర్‌శాస్త్రి ఐఏఎస్ అకాడమీకి డిప్యూటీ డైరెక్టర్‌గా కూడా సేవలందించారు.
తాజా వార్తలు
- నువైసీబ్ బార్డర్ నుంచి కువైట్ ఎయిర్వేస్కు ఫాస్ట్-ట్రాక్ రూట్..!!
- 30 రోజుల పాటు మారిటైమ్ లైసెన్సులను రద్దు చేసిన సౌదీ..!!
- ఒమన్‌ను ముంచెత్తిన వర్షాలు..ఆరుగురి మృతి..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్..ఉచిత ప్రవేశం పునఃప్రారంభం..!!
- ప్రైవేట్ రంగానికి సాధారణ పనివేళలు పునరుద్ధరణ..!!
- వ్యాట్ ఎగవేత..వ్యాపారవేత్తకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్‌లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల









