‘పులి మేక’: లావణ్య యాక్షన్ మోడ్ ఆన్.!

- February 21, 2023 , by Maagulf
‘పులి మేక’: లావణ్య యాక్షన్ మోడ్ ఆన్.!

అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ఈ మధ్య సినిమాలకు కాస్త దూరంగా వుంది. అందుకు కారణం మంచి అవకాశాలు రాకపోవడం కూడా ఓ కారణం కావచ్చనుకోండి. అయితే, ఈ ముద్దుగుమ్మ రెట్టించిన ఉత్సాహంతో ఓటీటీలో సందడి చేయబోతోంది.
లావణ్య త్రిపాఠి లీడ్ రోల్ పోషించిన ‘పులి మేక’ వెబ్ సిరీస్ ఈ నెల 24 నుంచి జీ 5 ఓటీటీ వేదికగా స్ర్టీమింగ్ కాబోతోంది. పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో నటించింది ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి. పెద్ద తెరపై లావణ్య ఎప్పుడూ కనిపించని సీరియస్ అండ్ పవర్ ఫుల్ రోల్ ఇది. 
ఈ సిరీస్ కోసం యాక్షన్ సన్నివేశాలూ ఇరగదీసేసింది లావణ్య. ఓ వైపు పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తూనే, దుష్ట శిక్షణ కావించేందుకు గన్ను చేత పట్టిన అమ్మోరు పాత్రలోనూ లావణ్య కనిపిస్తోంది. ఈ మధ్య వెబ్ సిరీస్‌ల ద్వారా పలువురు సీనియర్ నటీ నటులు మంచి పేరు తెచ్చుకుంటున్నారు.
అలాగే, ‘పులి మేక’ సిరీస్ లావణ్య త్రిపాఠి కెరీర్‌కి ఎంత మేర యూజ్ అవుతుందో చూడాలిక. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com