ఏడ్చే పిల్లలున్న తల్లులకు సుభవార్త

- May 03, 2016 , by Maagulf
ఏడ్చే పిల్లలున్న తల్లులకు సుభవార్త

విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు పిల్లలు ఏడిస్తే వారిని సముదాయించడంలో విమాన సిబ్బంది కూడా తల్లిదండ్రులకు సహాయపడుతుంటారు. మిగతా ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదని ఎవరైనా పిల్లలు ఏడవకూడదనే కోరుకుంటారు. అలాంటిది ఈ ఎయిర్‌లైన్స్‌ మాత్రం పిల్లలు ఏడిస్తే డిస్కౌంట్‌ ఇస్తానంటోంది..
అమెరికాకి చెందిన జెట్‌బ్లూ ఎయిర్‌వేస్‌ ఈ ఆఫర్‌ను ప్రకటించింది. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు పిల్లలు ఏడిస్తే తల్లిదండ్రులకి అదే ఎయిర్‌వేస్‌లో మరోసారి ప్రయాణించడానికి 25 శాతం డిస్కౌంట్‌ ఇస్తోంది. అంతేకాదు పిల్లలు మళ్లీ ఏడిస్తే ఆ డిస్కౌంట్‌ కాస్తా 50 శాతం అవుతుంది. అలా నాలుగు సార్లు ఏడిస్తే ఇక ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పిస్తోంది. మదర్స్‌ డే సందర్భంగా ఈ ఆఫర్‌ను ప్రకటిస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com