నిన్న కుక్కలు , నేడు కోతులు ..తెలంగాణ లో పసి పిల్లల పై వరుస దాడులు
- February 23, 2023
తెలంగాణ లో కుక్కలు , కోతుల దాడులు ఎక్కువైపోతున్నాయి. ఒంటరిగా పసి పిల్లలు కనిపిస్తే చాలు వారిపై దాడులకు పాల్పడుతున్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాద్ లోని పెద్ద అంబర్ పేట్ లో నాలుగేళ్ల బాలుడి ఫై మూడు కుక్కలు దాడి చేసి చంపేశాయి. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ గా మారింది. దీనిపై స్థానికులు , రాజకీయ పార్టీ లు సైతం GHMC ఫై ఆగ్రహం వ్యక్తం చేసాయి. ఈ దాడి గురించి ఇంకా మాట్లాడుతుండగానే తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోదుగుల గూడెం లో ఓ చిన్నారిపై కోతులు దాడి చేశాయి. పాపను వరండాలోని ఉయ్యాలలో పడుకోబెట్టి నీళ్ల కోసం తల్లి ఇంట్లోకి వెళ్ళింది.
ఈ తరుణంలోనే కోతులు ఒకసారిగా ఆ చిన్నారిపై దాడి చేశాయి. చిన్నారి కాలి బొటనవేలును కొరికాయి. దీంతో వెంటనే తల్లిదండ్రులు మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి ఆ చిన్నారిని తీసుకువెళ్లారు. ఇక అత్యవసర మెరుగైన వైద్యం కోసం వైద్యులు అక్కడి నుంచి వరంగల్ తరలించారు. ఇక ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గత కొద్దీ నెలలుగా గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని గ్రామస్థులు చెపుతున్నారు. పంటపొలాలను నాశనం చేయడమే కాకుండా ఇళ్లలోకి వచ్చి నానా బీబత్సం చేస్తున్నాయని , మనుషుల ఫై దాడి చేస్తున్నాయని వారంతా చెపుతున్నారు.
తాజా వార్తలు
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!