మావయ్యతో మల్టీస్టారర్.! తేజు ఎమోషనల్ ట్వీట్.!
- February 23, 2023
‘మావయ్యతో కలిసి పని చేయాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నా.. ఆ గోల్డెన్ డే రానే వచ్చింది. గురువుతో కలిసి పని చేయడం చాలా సంతోషంగా వుంది. ఈ ట్రావెల్‌లో ఆయన నుంచి మరిన్ని మంచి విషయాలు నేర్చుకుంటా..’ అంటూ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు.
తేజు, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘వినోదయ సితం’. తెలుగులో ఈ సినిమాకి ‘దేవర’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ సినిమా కోసం మావయ్యతో కలిసి పని చేయడం చాలా సంతోషంగా వుందని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు ట్విట్టర్ వేదికగా సాయి ధరమ్ తేజ్.
'THE BEST DAY' I would cherish forever.
— Sai Dharam Tej (@IamSaiDharamTej) February 22, 2023
It's a dream come true to work with my Guru for life @PawanKalyan ❤️
Grateful at this amazing opportunity & Can't wait for a big chunk of learning and memories.@thondankani @vishwaprasadtg @vivekkuchibotla @peoplemediafcy @ZeeStudios_ pic.twitter.com/q52FFy2kbk
తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ‘వినోదయ సితం’ సినిమాని దర్శకుడు, నటుడు అయిన సముద్రఖని తెలుగులో డైరెక్టర్ చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి స్ర్కీన్‌ప్లే అందిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కేతిక శర్మ, తేజుకి జంటగా నటిస్తోంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం రెండో సారి మోడ్రన్ దేవుడి అవతారమెత్తబోతున్నాడు.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!