గోపీచంద్ ‘రామబాణం’.! సక్సెస్ అయ్యేనా.?
- February 23, 2023
గోపీచంద్ కెరీర్‌లో ‘జిల్’, ‘లౌక్యం’ సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయ్. ఆ తర్వాత గోపీచంద్‌కి ఆ రేంజ్ హిట్ దక్కింది లేదింతవరకూ. గతేడాది ‘పక్కా కమర్షియల్’ అంటూ వచ్చాడు కానీ, బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాడు.
ఇప్పుడు ‘రామబాణం’ అనే సినిమాతో కసిగా వర్క్ చేస్తున్నాడు. శ్రీవాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గతంలో ‘లౌక్యం’ సినిమాతో గోపీచంద్‌కి హిట్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్. సో ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయ్. ‘ఖిలాడీ’ బ్యూటీ డింపుల్ హయాతి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. పీపుల్స్ మీడియా బ్యానర్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది.
జగపతిబాబు, కుష్బూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా, ఏప్రిల్‌లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శివరాత్రి సందర్భంగా వచ్చిన గోపీచంద్ ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘విక్కీ’ అనే పవర్‌ఫుల్ రోల్‌లో గోపీచంద్ కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి, ‘రామబాణం’తో గోపీచంద్ ఎంత మేర దూసుకొస్తాడో.!
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!