గోపీచంద్ ‘రామబాణం’.! సక్సెస్ అయ్యేనా.?
- February 23, 2023గోపీచంద్ కెరీర్లో ‘జిల్’, ‘లౌక్యం’ సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయ్. ఆ తర్వాత గోపీచంద్‌కి ఆ రేంజ్ హిట్ దక్కింది లేదింతవరకూ. గతేడాది ‘పక్కా కమర్షియల్’ అంటూ వచ్చాడు కానీ, బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాడు.
ఇప్పుడు ‘రామబాణం’ అనే సినిమాతో కసిగా వర్క్ చేస్తున్నాడు. శ్రీవాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గతంలో ‘లౌక్యం’ సినిమాతో గోపీచంద్‌కి హిట్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్. సో ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయ్. ‘ఖిలాడీ’ బ్యూటీ డింపుల్ హయాతి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. పీపుల్స్ మీడియా బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది.
జగపతిబాబు, కుష్బూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా, ఏప్రిల్‌లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శివరాత్రి సందర్భంగా వచ్చిన గోపీచంద్ ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘విక్కీ’ అనే పవర్ఫుల్ రోల్లో గోపీచంద్ కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి, ‘రామబాణం’తో గోపీచంద్ ఎంత మేర దూసుకొస్తాడో.!
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్