పొడవైన జిప్-లైన్ రైడ్ కు సిద్ధంగా ఉన్నారా?
- February 23, 2023
మస్కట్: ముసండం గవర్నరేట్‌లోని విలాయత్ ఆఫ్ ఖాసాబ్‌లో 1,800 మీటర్ల డ్యూయల్ జిప్‌లైన్ ప్రాజెక్ట్ కోసం సాఫ్ట్ ఓపెనింగ్ ను ఒమన్ టూరిజం డెవలప్‌మెంట్ కంపెనీ (OMRAN గ్రూప్) ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ పర్యాటకులకు సాహసం, అన్వేషణతో కూడిన అనేక అనుభవాలను అందించడానికి రూపొందించబడిన సమీకృత అడ్వెంచర్ సెంటర్‌లో భాగంగా రూపొందినట్లు పేర్కొంది. జిప్‌లైన్ ప్రాజెక్ట్ అనేది ఒమన్ అడ్వెంచర్ సెంటర్ అందించే మొదటి కార్యాచరణ ప్రోగ్రామ్ కింద రూపొందించారు. దీంతో ఈ ప్రాంతం ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారనుందని ముసందమ్ గవర్నర్ కార్యాలయ అధిపతి ముబారక్ బిన్ అలీ అల్ రహ్బీ తెలిపారు. ఈ విశిష్ట ప్రాజెక్ట్ ను త్వరంలోనే అధికారికంగా ప్రారంభించటానికి సిద్ధం చేస్తున్నట్లు OMRAN గ్రూప్‌లో డెవలప్‌మెంట్ మేనేజర్ మేసర్ అల్ కమ్జారీ వెల్లడించారు. జిప్‌లైన్‌ను అనుభవించడానికి అధికారిక సెలవులతో సహా వారాంతపు రోజులలో ఉదయం 09:00 నుండి సాయంత్రం 04:00 గంటల వరకు ఒమన్ అడ్వెంచర్ సెంటర్‌ను సందర్శకులు సందర్శించవచ్చు.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







