యూఏఈ అధ్యక్షుడితో సమావేశమైన బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్
- February 23, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్, యూఏఈ మధ్య దీర్ఘకాల సంబంధాలు రెండు దేశాలు, వారి ప్రజలకు ప్రయోజనం చేకూర్చే అనేక విజయాలను అందించాయని క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా పేర్కొన్నారు. హెచ్‌ఆర్‌హెచ్ ప్రిన్స్ సల్మాన్ అబుధాబిలోని కసర్ అల్ బహర్ ప్యాలెస్‌లో యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో సమావేశమయ్యారు. హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, హెచ్‌హెచ్ షేక్ మొహమ్మద్‌ల నిరంతర మద్దతుతో ఉమ్మడి లక్ష్యాలను సాధించడానికి ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంచుకోవడంపై చర్చించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆసక్తికి సంబంధించిన తాజా ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలు, బహ్రెయిన్-యూఏఈ సంబంధాలు, సహకారాన్ని మరింత పటిష్టం చేసే కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సమావేశంలో ఆర్థిక, జాతీయ ఆర్థిక మంత్రి షేక్ సల్మాన్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా, క్రౌన్ ప్రిన్స్ హెచ్‌ఆర్‌హెచ్ ప్రైవేట్ సెక్రటరీ షేక్ అబ్దుల్లా బిన్ ఇసా అల్ ఖలీఫా,యూఏఈలోని బహ్రెయిన్ రాయబారి షేక్ ఖలీద్ బిన్ అబ్దుల్లా బిన్ అలీ అల్ ఖలీఫా, పలువురు సీనియర్ యూఏఈ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







