‘కింగ్’ ఎయిర్‌పోర్ట్ ఉత్తర టెర్మినల్ వరకు బస్సు సర్వీస్ విస్తరణ

- February 23, 2023 , by Maagulf
‘కింగ్’ ఎయిర్‌పోర్ట్ ఉత్తర టెర్మినల్ వరకు బస్సు సర్వీస్ విస్తరణ

జెడ్డా: కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (KAIA), జెడ్డాలోని బలాద్ సిటీ సెంటర్‌ను కలిపే ఎక్స్‌ప్రెస్ బస్సు రవాణా సర్వీస్ రూట్‌ను విస్తరించినట్లు జెడ్డా ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ ప్రకటించింది. ఇది విమానాశ్రయ టెర్మినల్ 1ని టెర్మినల్ 2 (ఉత్తర టెర్మినల్)తో లింక్ చేయడం ద్వారా జరుగుతుందని పేర్కొంది. జెడ్డా ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ ఏప్రిల్ 2022లో ఎక్స్‌ప్రెస్ ట్రాన్స్‌పోర్ట్ బస్ సర్వీస్‌ను అమలు చేయడం ప్రారంభించింది. దీన్ని జెద్దా ఎయిర్‌పోర్ట్స్ కంపెనీ, సౌదీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ (SAPTCO) సహకారంతో ఏర్పాటు చేశారు.

బలాద్ సిటీ సెంటర్‌లోని కార్నిచ్ స్టేషన్ నుండి ఉత్తర టెర్మినల్ వరకు రౌండ్ ట్రిప్ మొత్తం పొడవు 104 కిమీ ఉంటుంది. వెళ్లి వచ్చేందుకు 210 నిమిషాలు పడుతుంది. అల్-బలాద్‌లోని విమానాశ్రయం, SAPTCO స్టేషన్‌లతో పాటు ఈ మార్గంలో 3 స్టాప్‌లు ఉన్నాయి. మొదటిది ప్రిన్స్ మజేద్ స్ట్రీట్‌లోని ఫ్లెమింగో మాల్ సమీపంలో కాగా.. రెండవది అల్-అండలస్ మాల్ సమీపంలో.. మూడవది మదీనా రోడ్‌లోని బాగ్దాదియా 7 జిల్లాలో ఉంది. ఈ సేవ జెద్దాలో ప్రజా రవాణా సేవలను అభివృద్ధి చేయడం, SR20 సరసమైన ధరతో అన్ని వర్గాలకు అత్యుత్తమ సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు జెడ్డా ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ తెలిపింది.

జెడ్డా ఎయిర్‌పోర్ట్స్ కంపెనీ విమానాశ్రయ టెర్మినల్స్‌లోని డిపార్చర్, అరైవల్ ఏరియాల్లో ప్రత్యేక బస్సు పార్కింగ్‌ను కేటాయించారు. అరైవల్ ఏరియాలో బస్టాప్‌ల ముందు వెయిటింగ్ స్టేషన్‌ను కూడా కంపెనీ ఏర్పాటు చేసింది. వికలాంగులకు కేటాయించిన స్థలాలు, ప్రయాణికుల బ్యాగేజీల కోసం ఖాళీ స్థలాలతో పాటు 33 మంది ప్రయాణికులు వెళ్లేలా బస్సులను రూపొందించడం గమనార్హం. బస్సు సర్వీస్‌ను ఉపయోగించాలనుకునే వారు విమానాశ్రయంలోని పలు సేల్స్ పాయింట్ల ద్వారా లేదా చెల్లింపు కోసం SAPTCO యాప్‌ని ఉపయోగించడం ద్వారా టిక్కెట్‌లను కొనుగోలు చేయవచ్చని జెడ్డా ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com