జూన్ 27లోపు ఏపీ రాజధాని ఉద్యోగులను అమరావతికి ..
- May 04, 2016
హైదరాబాద్‌లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను జూన్ 27లోపు ఏపీ రాజధాని అమరావతికి తరలిస్తామని ఏపీ పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ ప్రకటించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడి వద్ద ప్రభుత్వ భవన సముదాయ నిర్మాణాలను మంత్రి పరిశీలించారు. పనుల పురోగతిపై నిర్మాణ సంస్థ ప్రతినిధులతో చర్చించారు.సకాలంలో పనులు పూర్తి చేసి ప్రభుత్వానికి అందిస్తామని నిర్మాణ సంస్థ ప్రతినిధులు మంత్రి నారాయణకు హామీ ఇచ్చారు. సచివాలయంలో కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత కూడా నిర్మాణ పనులు కొనసాగుతాయన్నారు. ఉద్యోగుల విధులకు ఆటంకం లేకుండా నిర్మాణ పనులు పూర్తిచేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వివరించారు. అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు త్వరలోనే ప్లాట్లు అందిస్తామని మంత్రి చెప్పారు. ఇప్పటికే నేలపాడుకు ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇచ్చామన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







