పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ‘సౌదీ షో జంపింగ్ టీం’

- February 28, 2023 , by Maagulf
పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ‘సౌదీ షో జంపింగ్ టీం’

దోహా : సోమవారం ప్రారంభమైన దోహా ఇంటర్నేషనల్ షో జంపింగ్ ఛాంపియన్‌షిప్‌లో గ్రూప్ జి క్వాలిఫయర్స్‌లో సౌదీ షో జంపింగ్ జట్టు మొదటి స్థానంలో నిలిచి పారిస్ ఒలింపిక్స్ 2024కి అర్హత సాధించింది. సౌదీ షో జంపింగ్ జట్టుకు ఒలింపిక్ రైడర్లు రామ్జి అల్-దహమీ,అబ్దుల్లా అల్-షర్బత్లీ, రైడర్లు అబ్దుల్ రెహ్మాన్ అల్-రాజి, ఖలీద్ అల్-మబ్తి ప్రాతినిధ్యం వహించారు.

ఖతార్ ఈక్వెస్ట్రియన్ ఫెడరేషన్ & మోడరన్ పెంటాథ్లాన్ నిర్వహించే రెండు రోజుల ఛాంపియన్‌షిప్ అల్-షకాబ్‌లోని లాంగిన్స్ అవుట్‌డోర్ అరేనాలో జరుగుతోంది. టోర్నమెంట్‌లో సౌదీ అరేబియా, ఖతార్, మొరాకో, జోర్డాన్, యూఏఈ, ఈజిప్ట్,  సిరియా దేశాలు పాల్గొంటున్నాయి.

పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ‘సౌదీ షో జంపింగ్ టీం’కు సౌదీ అరేబియా ఈక్వెస్ట్రియన్ ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రిన్స్ అబ్దుల్లా బిన్ ఫహద్ లకు రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ , ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్, క్రీడల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ టర్కీ అల్-ఫైసల్‌ అభినందించారు. సౌదీ ఈక్వెస్ట్రియన్ క్రీడకు ఈ విజయం గొప్ప విజయమని తమ సందేశాల్లో పేర్కొన్నారు. 2024 పారిస్ ఒలింపిక్ క్రీడలలో సౌదీ జట్టు విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు.

2012 లండన్ ఒలింపిక్స్‌లో సౌదీ షో జంపింగ్ జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం. 2000లో సిడ్నీ ఒలింపిక్స్‌లో ఖలీద్ అల్-ఈద్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com