అనుష్క - నవీన్ పోలిశెట్టి కాంబో మూవీ టైటిల్ ఏంటో తెలుసా.?
- March 02, 2023
జేజమ్మ అనుష్క ‘నిశ్శబ్ధం’ సినిమా తర్వాత మళ్లీ ఇంతవరకూ సినిమాల్లో కనిపించింది లేదు. ఆ టైమ్‌లోనే జేజమ్మ ఓ డిఫరెంట్ సినిమాకి ఓకే చేసింది. అదే ‘జాతిరత్నాలు’ ఫేమ్ నవీన్ పోలిశెట్టితో స్వీటీ మూవీ. మొన్నామధ్య ఈ సినిమాలో అనుష్క పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రివీల్ చేశారు.
తాజాగా సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ అనే క్రేజీ టైటిల్‌ని ఈ సినిమాకి ఫిక్స్ చేశారు. వేసవి కానుకగా సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్లు ప్రకటించారు. నవీన్ పోలిశెట్టితో అనుష్క కాంబినేషన్ అంటేనే అదో రకం క్యూరియాసిటీ నెలకొంది.
మరి, సినిమా ఎలా వుండబోతోందో అనే ఆసక్తి ఇప్పుడింకా పెరిగింది. మహేష్‌బాబు.పి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. అన్విత రవళి శెట్టి అనే షెఫ్ పాత్రలో అనుష్క, సిద్ధు పోలిశెట్టి పాత్రలో నవీన్ పోలిశెట్టి నటిస్తున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు









