జనవరిలో కురిసిన సగటు వర్షపాతం 40 ఏళ్లలో అత్యధికం

- March 02, 2023 , by Maagulf
జనవరిలో కురిసిన సగటు వర్షపాతం 40 ఏళ్లలో అత్యధికం

రియాద్ : జనవరి నెలలో సౌదీ అరేబియాలోని అన్ని ప్రాంతాలలో సగటు వర్షపాతం 23.58 మిల్లీమీటర్లు (మిమీ) రికార్డు స్థాయికి చేరుకుందని పర్యావరణ, నీరు, వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇది గత 40 ఏళ్లలో అత్యధికం అని తెలిపింది. మంత్రిత్వ శాఖ హైడ్రోలాజికల్ మానిటరింగ్ స్టేషన్ల రికార్డుల ప్రకారం.. ఇది 2022లో అదే నెలలో నమోదైన సగటు కంటే 15.41 మిల్లీమీటర్లు ఎక్కువగా ఉంది. మంత్రిత్వ శాఖ, నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ (NCM) జనవరిలో 1980 రీడింగ్‌లను నమోదు చేసింది. అయితే మక్కా ప్రాంతంలోని జెడ్డా పోర్ట్ స్టేషన్‌లో జనవరి మొదటి రోజున అత్యధిక వర్షపాతం 84.6 మిమీగా నమోదైంది. జనవరిలో డ్యామ్‌లకు చేరిన వాగుల నుండి మొత్తం నీరు సుమారు 182.7 మిలియన్ క్యూబిక్ మీటర్లు కాగా, వాటి నుండి విడుదల చేసిన మొత్తం నీటి పరిమాణం 108.9 మిలియన్ క్యూబిక్ మీటర్లు అని నివేదిక తెలిపింది. మక్కా ప్రాంతంలోని డ్యామ్‌ల పరిమాణం 70.9 మిలియన్ క్యూబిక్ మీటర్ల కంటే ఎక్కువగా ఉన్నందున ఇన్‌కమింగ్ టొరెషియల్ వాటర్‌లో అత్యధిక వాటా ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మక్కా ప్రాంతంలోని రాబిగ్ డ్యామ్ దాదాపు 48.7 మిలియన్ క్యూబిక్ మీటర్లతో అత్యధిక ఇన్‌కమింగ్ టొరెంట్‌లను చూసిందని, అయితే టర్బా డ్యామ్ నుంచి అత్యధికంగా 15.2 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు విడుదల చేసినట్లు మంత్రిత్వ శాఖ నివేదిక పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com