భారత దేశవ్యాప్తంగా 240కి పైగా రైళ్లు రద్దు..
- March 03, 2023
న్యూ ఢిల్లీ: భారతీయ రైల్వే శాఖ వివిధ కారణాలతో ప్రతి రోజూ వందల సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తోంది. అందులో భాగంగా శుక్రవారం కూడా దేశవ్యాప్తంగా 240 రైళ్లను రద్దు చేసింది. మెయింటనెన్స్, మౌలిక సదుపాయాల కల్పన, భద్రతా కారణాల దృష్ట్యా మార్చి 3న నడవాల్సిన 240కిపైగా రైళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన మరో 87 రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
వీటిలో కాన్పూర్, అసన్ సోల్, ఢిల్లీ, లక్నో, బోకారో స్టీల్ సిటీ, బక్సర్, అమరావతి, వాద్రా, నాగ్ పూర్, పుణె, పఠాన్ కోట్, మదురై, రామేశ్వరంతోపాటు మరికొన్ని ప్రాంతాలకు వెళ్లాల్సిన రైళ్లు ఉన్నాయి. రైళ్లు రద్దైన నేపథ్యంలో ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఆయా రైళ్లలో ముందుగానే టికెట్ బుక్ చేసుకున్నవారికి డబ్బులు తిరిగి చెల్లిస్తామని తెలిపారు. అయితే తాము వెళ్లాల్సిన రైలు.. రద్దైన వాటి జాబితాలో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలన్నారు.
బుధవారం కూడా అధికారులు దేశవ్యాప్తంగా 250కిపైగా రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. వీటితోపాటు మరో 96 రైళ్లను నిలిపివేశారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం 351 రైళ్లు రద్దు అయ్యాయి. కాగా, ఫిబ్రవరి 5,9 తేదీల్లో సికింద్రాబాద్-దానాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. రైలు(07219) ఆదివారం(మార్చి5,2023) ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ నుంచి దానాపూర్ కు బయలుదేరుతుంది.
మళ్లీ అదే రైలు గురువారం(మార్చి9,2023)న రాత్రి 8.50 గంటలకు దానాపూర్ నుంచి సికింద్రాబాద్ కు బయల్దేరుతుందని అధికారులు తెలిపారు. అలాగే శుక్రవారం నుంచి 6వ తేదీ వరకు బెంగళూరు విశ్వేశ్వరయ్య స్టేషన్-నర్సాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!