నడకదారి భక్తులకు త్వరలో టోకెన్లు పున:ప్రారంభం: TTD EO

- March 03, 2023 , by Maagulf
నడకదారి భక్తులకు త్వరలో టోకెన్లు పున:ప్రారంభం: TTD EO

తిరుమల: నడకదారి భక్తులకు త్వరలో టోకెన్లు పున:ప్రారంభించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఈవో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో రాధామోహన్ దాస్ దుష్ప్రచారాన్ని నమ్మవద్దని అన్నారు. అక్రమాలకు పాల్పడటంతో రాధామోహన్ ను ఇస్కాన్ సంస్థ తొలగించిందని స్పష్టం చేశారు. భక్తులు దుష్ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

సుదర్శన్, గోవర్థన్, కల్యాణ్ సత్రాలను తొలగించి కొత్తగా నిర్మిస్తామని చెప్పారు. కాగా, ఫిబ్రవరిలో 18.42 లక్షల మందికి శ్రీవారి దర్శనం కల్పించినట్లు టీటీడీ పేర్కొంది. ఫిబ్రవరిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.114.29 కోట్లు వచ్చిందని వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com