సౌదీ అరేబియాలో తెలుగు నర్స్‌కు డైసీ అవార్డు
- March 03, 2023
జెడ్డా: రియాద్‌లోని కింగ్ ఫహద్ మెడికల్ సిటీ(KFMC)లో ఎమర్జెన్సీ విభాగంలో హెడ్ నర్సుగా పనిచేస్తున్న లక్ష్మి రాచమల్లుకి గ్లోబల్ నర్సింగ్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన డైసీ అవార్డు లభించింది. డైసీ (DAISY-డిసీజెస్ అటాకింగ్ ది ఇమ్యూన్ సిస్టం) అవార్డ్ 33 దేశాల్లో గుర్తింపు పొందిన అంతర్జాతీయ అవార్డు. దీనిని విధినిర్వహణలో నైపుణ్యం, మానవత సేవలు చేసే నర్సులను గుర్తించి అందజేస్తారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో ఉన్న KFMC 1200 పడకల ఆస్పత్రి. సంవత్సరానికి 500,000 మంది ఔట్ పేషెంట్లకు సేవలు అందిస్తుంది. కొవిడ్-19 సంక్షోభ సమయంలో 33 రోజులు ICUలో గడిపిన కెనడియన్ రోగికి లక్ష్మి మెరుగైన సంరక్షణను అందించింది. ఈ సేవలను గుర్తించి యాజమాన్యం ఆమె పేరును డైసీ అవార్డుకు సిఫార్సు చేసింది. కడప జిల్లాకు చెందిన లక్ష్మి గత 17 సంవత్సరాలుగా సౌదీ అరేబియాలో ఉంటున్నారు. దానికంటే ముందు ఆమె హైదరాబాద్‌లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో పనిచేశారు. అమెరికాకు చెందిన తన బంధువులతో కలిసి పేదలకు సేవ చేసేందుకు తన స్వగ్రామంలో స్వచ్ఛంద ఆసుపత్రిని స్థాపించాలని యోచిస్తోన్నట్లు లక్ష్మి వెల్లడించారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!