GIS 2023లో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు..
- March 03, 2023
విశాఖపట్నం: విశాఖ వేదికగా ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సమ్మిట్ కు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, కరణ్ అదానీ, సంజీవ్ బజాజ్, జీఎం రావు, నవీన్ జిందాల్, 45కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఇక ఈ సమ్మిట్ లో ఏపీ ప్రభుత్వం భారీ స్థాయిలో ఎంవోయూలు కుదుర్చుకుంది. వీటిలో కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువైన ఎంవోయూలు ఉండడం విశేషం.
ఎన్టీపీసీ ఎంవోయూ విలువ రూ.2.35 లక్షల కోట్లు కాగా, ఏబీసీ లిమిటెడ్ తో ఒప్పందం విలువ రూ.1.20 లక్షల కోట్లు. ఇక రిలయన్స్ ఏపీలో 10 గిగావాట్ల రెన్యువబుల్ సోలార్ ఎనర్జీ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నట్టు జీఐఎస్ వేదికపై నుంచి ముఖేశ్ అంబానీ ప్రకటించారు. అటు జిందాల్ గ్రూప్ కూడా కృష్ణపట్నం పోర్టు సమీపంలో రూ.10 వేల కోట్లతో 3 మిలియన్ టన్నుల సామర్థ్యం గల ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
అలాగే సన్నీ ఒపోటెక్, వెనికా హైడ్రల్ పవర్, ఓబెరాయ్ గ్రూప్, టీవీఎస్, ఆంధ్రా పేపర్, అల్ట్రాటెక్, భూమి వరల్డ్, అంప్లస్ ఎనర్జీ, వెల్ స్పన్, హైజెన్ కో, గ్రిడ్ ఎడ్జ్ వర్క్స్, సెల్ కాన్, మంజీరా హోటల్స్, భ్రమరాంబ, డెక్కన్ ఫైన్ కెమికల్స్, లారస్ గ్రూప్, ఎలక్ట్రో స్టీల్ క్యాస్టింగ్స్, టీసీఎల్, ఏజీపీ సిటీ గ్యాస్, జేసన్ ఇన్ ఫ్రా, మైహోమ్, డైకిన్, వర్షిణి పవర్, ఏఎం గ్రీన్ ఎనర్జీ, ఐపీసీఎల్, ఆశ్రయం ఇన్ ఫ్రా, ఏస్ అర్బన్ డెవలపర్స్, డ్రీమ్ వ్యాలీ గ్రూప్, విష్ణు కెమికల్స్, ఎమ్మార్ కేఆర్ కన్ స్ట్రక్షన్స్, దివీస్, శారదా మెటల్స్, తుని హోటల్స్, ఉత్కర్ష అల్యూమినియం సంస్థలు కూడా రాష్ట్రంలో ఎంవోయూలు కుదుర్చుకున్నాయి.
వీటితో పాటు.. జేఎస్ డబ్ల్యూ గ్రూప్- రూ.50,632 కోట్లు
గ్రీన్ కో- రూ.47,600 కోట్లు
అరబిందో గ్రూప్- రూ.10,635 కోట్లు
అదానీ ఎనర్జీ గ్రూప్- రూ.21,820 కోట్లు
ఆదిత్య బిర్లా గ్రూప్- రూ.9,300 కోట్లు
టీసీఎల్- రూ.5,500 కోట్లు
జిందాల్ స్టీల్- రూ.7,500 కోట్లు
హీరో ఫ్యూచర్ ఎనర్జీస్- రూ.30,000 కోట్లు
రెన్యూ పవర్- రూ.97,550 కోట్లు
టీఈపీఎస్ఓఎల్- రూ.65,600 కోట్లు
ఇండోసాల్- రూ.76,033 కోట్లు
అవాదా గ్రూప్- రూ.50,000 కోట్లు
ఏసీఎంఈ- రూ.68,976 కోట్లు
హంచ్ వెంచర్స్- రూ.50,000 కోట్లు
ఎకోరెన్ ఎనర్జీ- రూ.15,500 కోట్లు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!