ఆన్‌లైన్‌లో ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్‌ ఎలా చెక్ చేయాలో తెలుసా?

- March 03, 2023 , by Maagulf
ఆన్‌లైన్‌లో ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్‌ ఎలా చెక్ చేయాలో తెలుసా?

న్యూ ఢిల్లీ: ఆన్‌లైన్‌లో ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) రీఛార్జ్ చేసుకోవడం తెలుసా? ఇందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీని తగ్గించేందుకు భారత ప్రభుత్వం (GOI) ఫాస్ట్‌ట్యాగ్ అని పిలిచే టోల్ వసూలు చేసే డిజిటల్ సిస్టమ్ ప్రారంభించింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)చే నిర్వహించే ఫాస్ట్‌ట్యాగ్ ఒక ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ అని చెప్పవచ్చు. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీని ఉపయోగించి వినియోగదారు లింక్ చేసిన అకౌంట్ నుంచి నేరుగా టోల్ యజమాని అకౌంట్‌కు టోల్ పేమెంట్స్ ప్రారంభించింది.

అన్ని ప్రైవేట్, వాణిజ్య వాహనాలకు ప్రభుత్వం ఫాస్ట్‌ట్యాగ్‌ని తప్పనిసరి చేసింది. అయితే, హైవే టోల్ ప్లాజా వద్ద ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ETC)-రెడీ లేన్ ద్వారా డ్రైవ్ చేసేందుకు మీ ఫాస్ట్‌ట్యాగ్ వ్యాలెట్‌లో తగినంత బ్యాలెన్స్ ఉంచడం చాలా ముఖ్యమని గుర్తించాలి. FASTag బ్యాలెన్స్‌ని ఎలా చెక్ చేయాలి. ఆన్‌లైన్‌లో లేదా ఇతర పద్ధతుల ద్వారా రీఛార్జ్ చేయడం ఎలాగో ఇప్పుడు చూద్దాం..

ఆన్‌లైన్‌లో ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్‌ని ఎలా చెక్ చేయాలంటే?
FASTag అకౌంట్లు ఎల్లప్పుడూ మీ అధికారిక బ్యాంక్ ID ద్వారా క్రియేట్ అవుతాయి.
– మీ FASTag బ్యాలెన్స్‌ని చెక్ చేసేందుకు మీ FASTag IDని క్రియేట్ చేసిన మీ బ్యాంక్ వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
– బ్యాంక్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసిన తర్వాత ఫాస్ట్‌ట్యాగ్ కేటగిరీ కోసం సెర్చ్ చేయండి. మీ ఆధారాలను ఉపయోగించి పోర్టల్‌లోకి Login అవ్వండి.
– మీ మిగిలిన అకౌంట్ బ్యాలెన్స్‌ని చెక్ చేయడానికి వ్యూ ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్ ఆప్షన్‌పై (Next) క్లిక్ చేయండి.

NHAI వ్యాలెట్ ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్‌ని ఎలా చెక్ చేయాలంటే?
– మీ ఫోన్‌లో Google Play Store లేదా App Store ఓపెన్ చేయండి.
– ‘My FASTag App’ కోసం సెర్చ్ చేయండి. లేదంటే యాప్ డౌన్‌లోడ్ చేయండి.
– ఇప్పుడు యాప్‌కి Login చేయండి.
– మీరు యాప్‌లో మీ FASTag అకౌంట్ సంబంధించిన వివరాలను చెక్ చేయవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com