ఎడారి పర్యాటకంపై సరికొత్త నియమ నిబంధనలు

- May 04, 2016 , by Maagulf
ఎడారి పర్యాటకంపై సరికొత్త నియమ నిబంధనలు

దుబాయ్‌ కొత్త నిబంధనలతో ఎడారి పర్యాటకులకు మరింత ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించనుంది. భద్రత ఇక్కడ అతి ప్రాధాన్యత అంశంగా తీసుకుని, కొత్త నిబంధనల్ని పొందు పర్చారు. ఈ నిబంధనలు మూడు నెలల్లో అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధనల ప్రకారం, వ్యక్తిగత ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని టూర్‌ ఆపరేటర్లు, పర్యాటకులకు సౌకర్యాలు అందజేయాల్సి ఉంటుంది. అలాగే, టూరిజం డిపార్ట్‌మెంట్‌ నుంచి అనుమతుల విషయంలో ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు అవకాశం లేకుండా కొత్త నిబంధనల్ని రూపొందించారు. దుబాయ్‌లో పర్యటించేవారు, తమ తొలి ప్రాధాన్యతగా డిజర్ట్‌ రైడింగ్‌ని ఎంచుకుంటారు. ఈ క్రమంలో వారికి ఎలాంటి ఇబ్బందులూ రాకుండా వాహనాల సర్టిఫికెషన్‌, అలాగే వాహనాల్లో చైల్డ్‌ కార్‌ వంటివాటిని తప్పనిసరి చేస్తూ నిబంధనల్ని పొందుపర్చారు. రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ, దుబాయ్‌ మునిసిపాలిటీ, దుబాయ్‌ పోలీస్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ సివిల్‌ డిఫెన్స్‌ సంయుక్తంగా బుకింగ్‌ ఏజెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్స్‌, డ్రైవర్స్‌తో భద్రత, కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌, నిబంధనలు, క్వాలిటీ ఆఫ్‌ స్టాండర్డ్స్‌పై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాయి. దుబాయ్‌ని సందర్శించేవారిలో 20 శాతం మంది ఏడారి రైడ్‌ అనుభూతి కోసం ప్రయత్నిస్తుంటారు. దుబాయ్‌లో టాప్‌ 10 యాక్టివిటీస్‌లో ఈ ఎడారి రైడ్‌ కూడా ఒకటి. దాంతో, ఈ రంగంపై దుబాయ్‌ ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని అధికారులు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com