భారత్ లో కొవిడ్ లాగా పెరుగుతున్న ఫ్లూ కేసులు
- March 07, 2023
న్యూఢిల్లీ: దేశంలో హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డా. రణదీప్ గులేరియా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వైరస్ కొవిడ్ లాగా వ్యాపిస్తోందని పేర్కొన్నారు. గాల్లో తుంపర్ల ద్వారా వ్యాపించే ఈ వైరస్ సాధారణంగా ఏటా ఈ సమయంలో మార్పులకు లోనవుతుందని చెప్పారు. అయితే..పెద్దలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకు జాతీయ మీడియాకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు.
‘‘ప్రస్తుతం మనం ఇన్‌ఫ్లూయెంజా కేసులు పెరగడాన్ని చూస్తున్నాం. ఏటా ఈ టైంలో ఈ వైరస్ వ్యాప్తి పెరుగుతుంటుంది. దీని వల్ల జ్వరం, దగ్గు, గొంతులో గరగర, ఒళ్లు నొప్పులు, జలుబు వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అయితే..ఈ వైరస్ ఏటా మార్పులకు లోనవుతుంది. దీన్ని యాంటీజెనిక్ డ్రిఫ్ట్ అంటారు. కొన్నేళ్ల క్రితం హెచ్1ఎన్1 వైరస్‌తో సంక్షోభం వచ్చింది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నది హెచ్3ఎన్2 రకం వైరస్. ఇది సాధారణ ఫ్లూ వేరియంటే. అయితే..వైరస్ తరచూ మార్పులకు లోనై రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకోగలుగుతోంది. దీంతో.. కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ వైరస్ గాల్లో తుంపర్ల ద్వారా వ్యాపిస్తోంది. అయితే..ఇదేమంత ఆందోళనకరమైన అంశం కాదు. కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్యలో భారీ పెరుగుదల లేదు’’ అని డా. గులేరియా వివరించారు. వాతావరణ మార్పుల కారణంగా హెచ్3ఎన్2 సహజంగానే మార్పులకు లోనవుతుంటుందని చెప్పుకొచ్చారు.
ప్రజల్లో మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి అలవాట్లు తగ్గడంతో ఇన్‌ఫ్లుయెంజా కేసుల సంఖ్య పెరుగుతోందని ఆయన చెప్పారు. ఈ జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వైరస్ వేగంగా వ్యాపించగలుగుతోందని చెప్పారు. కాబట్టి.. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు మాస్కులు దరించాలని, తరచూ చేతులను శుభ్రపరుచుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్‌డి స్మార్ట్ సిటీ ఇండెక్స్‌లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం









