లాంగ్‌ వీకెండ్‌: ఆసుపత్రుల పనివేళలు

- May 04, 2016 , by Maagulf
లాంగ్‌ వీకెండ్‌: ఆసుపత్రుల పనివేళలు



దుబాయ్‌ హెల్త్‌ అథారిటీ (డిహెచ్‌ఎ) డిహెచ్‌ఎ అడ్మినిస్ట్రేషన్‌, హాస్పిటల్స్‌, ప్రైమరీ హెల్త్‌ సెంటర్స్‌ అలాగే మెడికల్‌ ఫిట్‌నెస్‌ సెంటర్స్‌ పనివేళల్ని అల్‌ ఇస్రా వల్‌ మిరాజ్‌ సెలవు దినం సందర్భంగా ప్రకటించింది. డిహెచ్‌ఎ హాస్పిటల్స్‌ షిఫ్ట్‌ టైమింగ్స్‌ ష్ట్రప్రకారం నడుస్తాయనీ, మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌ అందుబాటులో ఉంటారని వెల్లడించింది. డిహెచ్‌ఎ హాస్పిటల్స్‌కి సంబంధించిన ఎమర్జన్సీ డిపార్ట్‌మెంట్స్‌ (రషీద్‌, దుబాయ్‌, లతీఫా మరియు హట్టా) రౌండ్‌ ది క్లాక్‌ పనిచేస్తాయి. దుబాయ్‌ హాస్పిటల్‌, రషీద్‌ హాస్పిటల్‌లో ఔట్‌ పేషెంట్‌ క్లినిక్స్‌ సెలవుల సందర్భంగా మూసివేయబడ్తాయి. లతీఫా హాస్పిటల్‌ ఔట్‌ పేషెంట్‌ క్లినిక్‌ మూతపడినా, పిడియాట్రిక్‌ వాక్‌ ఇన్‌ క్లినిక్‌ పనిచేస్తుంది. హట్టా హాస్పిటల్‌ ఫర్‌ ఫ్యామిలీ మెడిసిన్‌ క్లినిక్‌ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు తెరచి ఉంటుంది. స్పెషలిస్ట్‌ ఔట్‌పేషెంట్‌ క్లినిక్స్‌ మూతపడ్తాయి. పిహెచ్‌సి టైమింగ్స్‌ (నాద్‌ అల్‌ హమార్‌, అల్‌ మర్షా హెల్త్‌ సెంటర్స్‌) 24 గంటలూ తెరిచే ఉంటాయి. మిగతా ప్రైమరీ హెల్త్‌ కేర్‌ సెంటర్స్‌కి సెలవు. అల్‌ ముహాసినా మెడికల్‌ ఫిట్‌నెస్‌ సెంటర్‌ ఉదయం 8 గంటల నుంచి 1 గంటల వరకు తెరిచి ఉంటుంది. మిగతా డిహెచ్‌ఎ మెడికల్‌ ఫిట్‌నెస్‌ సెంటర్స్‌కి సెలవు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com