వరల్డ్ పోలీస్ సమ్మిట్ 2023: ప్రారంభోత్సవానికి హాజరైన షేక్ హమ్దాన్

- March 08, 2023 , by Maagulf
వరల్డ్ పోలీస్ సమ్మిట్ 2023: ప్రారంభోత్సవానికి హాజరైన షేక్ హమ్దాన్

యూఏఈ: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మంగళవారం దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో వరల్డ్ పోలీస్ సమ్మిట్ 2023 ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఈవెంట్ రెండవ ఎడిషన్ చట్టాన్ని అమలు చేసే అధికారులు, భద్రతా నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భవిష్యత్ పోలీసింగ్-భద్రతపై చర్చించారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 50 లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా షేక్ హమ్దాన్ మాట్లాడుతూ.. యూఏఈ భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడానికి, మొత్తం సమాజానికి రక్షణ కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చట్ట పాలనను అమలు చేయడంలో అంతర్జాతీయ సహకారం ప్రాముఖ్యతను చెప్పారు. అన్ని రకాల నేరాలను అడ్డుకునేందుకు అంతర్జాతీయంగా సమాచార మార్పిడి తప్పనిసరి అని పేర్కొన్నారు.

ప్రపంచ పోలీసు సదస్సు సందర్భంగా దుబాయ్ పోలీస్ సైంటిస్ట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎక్స్‌పర్ట్స్ హబ్ ప్లాట్‌ఫారమ్‌ను ఆయన సందర్శించారు. ఈ ప్లాట్‌ఫారమ్ భద్రతా రంగంలోని నిపుణులను కనెక్ట్ చేయడానికి.. సవాళ్లను చర్చించడానికి ప్రయత్నిస్తుంది. ఈవెంట్‌లో పాల్గొనే అంతర్జాతీయ కంపెనీలు ప్రదర్శించే వినూత్న సాంకేతికతలను కూడా హిజ్ హైనెస్‌ అడిగి తెలుసుకున్నారు. ప్రపంచ పోలీసు సమ్మిట్ 2023లో 250 కంటే ఎక్కువ స్థానిక, అంతర్జాతీయ సంస్థలు పాల్గొంటున్నారు. 112 దేశాలకు చెందిన 100 మంది పోలీసు చీఫ్‌లు, 15,000 మంది సెక్యూరిటీ, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com