రమదాన్: పాఠశాల వేళలలో మార్పులు

- March 10, 2023 , by Maagulf
రమదాన్: పాఠశాల వేళలలో మార్పులు

యూఏఈ: రమదాన్ సందర్భంగా దుబాయ్‌లో పాఠశాలల సమయాలు మారాయి. ఐదు గంటల కంటే ఎక్కువ బోధన సమయం ఉండకూడదని నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KHDA) శుక్రవారం ప్రకటించింది.దుబాయ్‌లోని GEMS అవర్ ఓన్ ఇండియన్ స్కూల్‌లోని ప్రిన్సిపాల్ లలిత సురేష్ మాట్లాడుతూ.. స్కూల్స్ సమయాలను నిర్ణయించడానికి KDHA తల్లిదండ్రులు, విద్యారంగ నిపుణులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే నిర్ణయిస్తారని చెప్పారు.ఈ నేపథ్యంలో కొన్ని పాఠశాలలు సోమవారం నుండి గురువారం వరకు 7.45am నుండి 12.45pm వరకు షెడ్యూల్‌ ప్రకటించాయి. శుక్రవారము మాత్రం సాధారణంగానే స్కూల్స్ నడుస్తాయని అథారిటీ వెల్లడించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com