ముఘలాయ్ పన్నీర్
- March 11, 2023
కావలసిన పదార్థములు:-
ఉల్లిపాయ - 1, టొమాటోలు -2, పనీర్ క్యూబ్స్ - 400 గ్రా, అల్లం- చిన్న ముక్క, వెల్లుల్లి 4 రెబ్బలు,పచ్చి మిరపకాయలు 2 , కొత్తిమీర, కసూరి మేతి 1 స్పూన్, జీడీ పప్పులు 12-15 , మెలోన్ గింజలు 1 టేబుల్ స్పూన్ , పెరుగు చిన్న కప్, ఫుల్ క్రీం 2 టేబుల్ స్పూన్స్ , నెయ్యి 2 టేబుల్ స్పూన్స్ , ధనియా పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్ , పసుపు 1 స్పూన్, కాశ్మీరీ చిల్లి పొడి 1-2 స్పూన్స్, గరం మసాలా పొడి 1 స్పూన్, మసాలా ఆకు 1
తయారు చేసే పధ్ధతి :
ముందర ఉల్లిపాయ, టొమాటోస్, అల్లం, వెల్లుల్లి, పచ్చి మిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
ఒక పాన్ లో, 3 చెమ్చాలు నెయ్యి తీసుకుని, నెయ్యి వేడి అయ్యాక, బిర్యాని ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి 3 నిమిషాలు వేయించి, అల్లం, పచ్చిమిర్చి, వెలుల్లిముక్కలు వేసి పచ్చిదనం పోయేంత వరకు వేయించండి. ఇప్పుడు పన్నీర్ క్యూబ్స్ చిదపకుండా అన్ని వైపులా గోల్డెన్ రంగు వచ్చేంత వరకు వేయించండి. ఇప్పుడు టమాటో ముక్కలు వేసి మరో 5 నిమిషాల పాటు వేయించండి. మెలోన్ గింజలు, జీడిపప్పులు కొంచెం నీరు వేసి మిక్సీలో మెత్త గా రుబ్బి ఆ పేస్ట్ ని బాణలి లో వేసి ఒక కప్ నీరు వెయ్యండి.గరిట తో కలియ తిప్పాక, పసుపు, కాశ్మీరీ కారం, ధనియా పొడి, జీరా పొడి, గరం మసాలా పొడి వెయ్యండి. ఒక చిన్న కప్ పెరుగు వేసి గరిటతో కలియ తిప్పండి. స్టవ్ సింలో పెట్టి, 10 నిమిషాల పాటు వేయించాలి, గ్రేవీ చిక్కదనం పోకుండా, పెరుగు విరగకుండా మధ్య లో
గరిట తో కలియతిప్పుతు ఉండాలి. కూర అంచులు నెయ్యి నుంచి విడినప్పుడు తగినంత ఉప్పు వేసి. కూర పైన కసూరి మేతి, కొత్తి మీరా వేసి , 2 స్పూన్స్ ఫ్రెష్ క్రీం వలయ ఆకారం లో కూర పైన వెయ్యాలి.
ఇలా చేసిన ముఘలాయ్ పన్నీర్ వేడి వేడి గా రొట్టె తో కానీ బిర్యాని తో కానీ తింటే రుచి అమోఘం.
పి. లక్ష్మి కాంత్
న్యూ యార్క్ .
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్లు
- బీచ్లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి