రెండు ఆస్కార్ లను గెలుచుకున్న భారత్

- March 13, 2023 , by Maagulf
రెండు ఆస్కార్ లను గెలుచుకున్న భారత్

లాస్ ఏంజిల్స్ (అమెరికా): భారతదేశానికి ఇది చారిత్రాత్మకమైన రోజు! భారతీయ డాక్యుమెంటరీ చిత్రం 'ఎలిఫెంట్ విస్పరర్స్' 'ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్' విభాగంలో ఆస్కార్‌ను గెలుచుకుంది. నిర్మాత గునీత్ మోంగా.. దర్శకుడు కార్తికీ గోన్సాల్వేస్ ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా గోన్సాల్వేస్ మాట్లాడుతూ.. "మనకు, మన సహజ ప్రపంచానికి మధ్య ఉన్న పవిత్ర బంధం గురించి మాట్లాడటానికి నేను ఈ రోజు ఇక్కడ నిలబడి ఉన్నాను. ఇతర జీవుల పట్ల అస్తిత్వం కోసం, మేము మా స్థలాన్ని పంచుకుంటాము. చివరకు సహ కోసం -అస్తిత్వం. స్వదేశీ ప్రజలను, జంతువులను హైలైట్ చేస్తూ మా చిత్రాన్ని గుర్తించినందుకు అకాడమీకి ధన్యవాదాలు. ఈ చిత్రం  శక్తిని విశ్వసించినందుకు నెట్‌ఫ్లిక్స్‌కు. నా నిర్మాతకు.. నా టీమ్ మొత్తానికి గునీట్‌కి, చివరకు అక్కడ ఉన్న మా అమ్మ నాన్న, సోదరికి ఎక్కడో, నువ్వు నా విశ్వానికి కేంద్రం. నా మాతృభూమి భారతదేశానికి ధన్యవాదాలు." అంటూ ఆమె పేర్కొన్నారు. తమిళనాడులోని ముదుమలై టైగర్ రిజర్వ్‌లో రెండు అనాథ ఏనుగులను దత్తత తీసుకున్న కుటుంబం చుట్టూ సినిమా కథాంశం తిరుగుతుంది. గునీత్ మోంగా భారత్‌కు ఆస్కార్‌ను తీసుకురావడం ఇదే మొదటిసారి కాదు. 2019లో గునీత్ మోంగా డాక్యుమెంటరీ 'పీరియడ్. ఎండ్ ఆఫ్ సెంటెన్స్' డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్‌లో ఆస్కార్‌ను కైవసం చేసుకుంది.

ఇదిలా ఉండగా బ్లాక్‌బస్టర్ మూవీ 'RRR'లోని నాటు నాటు సాంగ్ 'ఉత్తమ ఒరిజినల్ సాంగ్' విభాగంలో ఆస్కార్ 2023ని గెలుచుకుంది. వైరల్ సెన్సేషన్‌గా మారిన 'నాటు నాటు' యూట్యూబ్‌లో 122 మిలియన్లకు పైగా వ్యూస్ ని సంపాదించింది. మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్‌.ఎమ్‌ కీరవాణి, నాటు నాటు పాట రాసిన చంద్రబోస్‌ అవార్డులను అందుకున్నారు. అంతకుముందు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ లోని ‘జయహో’ కు ఆస్కార్ వచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com