లవంగంతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.?
- March 14, 2023
మసాలా దినుసులా లవంగాన్ని ఉపయోగిస్తుంటాం. కానీ, లవంగంతో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నాయ్. లవంగంలో యూజనల్ అనే రసాయన పదార్ధం వుంటుంది.
ఈ రసాయన పదార్ధం కారణంగా నొప్పిని తగ్గించే లక్షణం లవంగానికి చాలా ఎక్కువ. పంటి నొప్పి వచ్చినప్పుడు లవంగాన్ని ఆ నొప్పి వున్న ప్రాంతంలో వుంచితే నొప్పి లాగేస్తుంది.
అలాగే, దగ్గు, ఆయాసం.. వంటి శ్వాస సంబంధిత వ్యాధులకు లవంగం మంచి ఔషధం. లవంగం, పుదీనా, తులసి కలిపిన టీని రోజూ తీసుకోవడం వల్ల అనేక రకాల శ్వాస సంబంధిత వ్యాధులు క్రమంగా నివారించబడతాయి.
అలాగే, జీర్ణం కాకపోవడం, కడుపుబ్బరం, వికారం వంటి సమస్యలను తగ్గించడానికి తేనె, లవంగం కలిపిన మిశ్రమాన్ని నీటిలో కలిపి తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది.
కూరలకు మంచి రుచినే కాదు, సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి బాధల్ని నివారించడంలో లవంగం వంటింటి చిట్కాల్లో కీలక పాత్ర వహిస్తుంది.
తాజా వార్తలు
- కొత్త క్యాంపస్ ఏపీలో...12,000 కొత్త ఉద్యోగాల అవకాశాలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్గ్రౌండ్లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం