కొత్త ప్రపంచ రికార్డు: ప్రపంచంలోనే అతి చిన్న రన్‌వే చూశారా?

- March 16, 2023 , by Maagulf
కొత్త ప్రపంచ రికార్డు: ప్రపంచంలోనే అతి చిన్న రన్‌వే చూశారా?

దుబాయ్: తొలిసారిగా లుకాస్జ్ జెపిలా అనే ఎయిర్‌లైన్ పైలట్ బుర్జ్ అల్ అరబ్ హెలిప్యాడ్‌లో విమానం బుల్‌సీ ల్యాండింగ్‌ను విజయవంతంగా పూర్తి చేశాడు. ఐకానిక్ హెలిప్యాడ్ కేవలం 27 మీటర్ల వ్యాసం, దాని మొదటి విమానం టేకాఫ్, ల్యాండింగ్‌ను చాకచక్కంగా పైలట్ పూర్తి చేశారు. విజిట్ దుబాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హెలిప్యాడ్‌లో పరిస్థితిని ఏవియేషన్ ఇంజనీర్ అయిన మైక్ పేటీ పర్యవేక్షించారు. ఎలాంటి రిఫరెన్స్ పాయింట్లు లేకుండా.. హోటల్‌లోని 56వ అంతస్తు అయిన 212 మీటర్ల ఎత్తులో ల్యాండింగ్ నిర్వహించి రికార్డు సృష్టించారు. విమానంలో బరువును వీలైనంత వరకు తగ్గించి, ఆ ఘనతను సాధించేలా చేసేందుకు 13 ప్రత్యేక మార్పులు చేసినట్లు మైక్ పేటీ వివరించారు.విమానం బరువును 400 కిలోగ్రాములకు తగ్గించామని, బ్రేకింగ్ కోసం ప్రధాన ఇంధన ట్యాంక్‌ను విమానం వెనుకకు తరలించామని, హెలిప్యాడ్ నుండి టేకాఫ్ చేసేందుకు అధిక శక్తి కోసం నైట్రస్‌ని వినియోగించినట్లు తెలిపారు. ఫైనల్ రికార్డు ల్యాండింగ్ కంటే ముందు మైదానంలో 650 సార్లు రిహర్సల్స్ చేసినట్లు పైలట్ తన ఇన్‌స్టాగ్రామ్ కథనంలో వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com