అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన భారతీయులకు భారీ ఊరట
- March 16, 2023
అమెరికా: అమెరికాలో ఉద్యోగం లేని హెచ్-1బీ వీసాదారులకు ఓ గుడ్ న్యూస్. ప్రస్తుతమున్న 60 రోజుల వీసా గ్రేస్ పీరియడ్‌ను 180 రోజులకు పొడిగించాలంటూ అమెరికా అధ్యక్ష సలహా ఉపసంఘం సిఫారసు చేసింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే భారతీయులకు భారీ ఊరట లభించినట్టే. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. హెచ్-1బీ వీసాదారులు 60 రోజుల్లోపు కొత్త ఉద్యోగంలో చేరని పక్షంలో సొంత దేశాలకు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది.
ఇటీవల అమెరికా టెక్ రంగంలోని లేఆఫ్స్ కారణంగా అనేక మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. వీరిలో అధికశాతం మంది హెచ్-1బీ వీసాదారులు కావడంతో ఈ ‘60 రోజుల డెడ్‌లైన్’ వారి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాజా సిఫారసు అమల్లోకి వస్తే.. హెచ్-1బీ వీసాదారులు కొత్త ఉద్యోగం వెతుక్కునేందుకు ఏకంగా 180 రోజుల సమయం చిక్కుతుంది. ఇక గ్రీన్ కార్డుల విషయంపైనా ప్రభుత్వం చర్చించింది. గ్రీన్‌కార్డు దరఖాస్తు ప్రక్రియ తొలిదశలో ఉద్యోగ ధ్రువీకరణ పత్రానికి సంబంధించిన అంశంపైనా సమాలోచనలు జరిపింది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!