‘హజ్ యాత్రికుల రీఫండ్’పై మార్గదర్శకాలు జారీ
- March 17, 2023
రియాద్ : హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ 2023 హజ్ కోసం నమోదు చేసుకున్న సౌదీ అరేబియాలోని యాత్రికుల కోసం అనుమతిని జారీ చేయడానికి ముందు,తర్వాత రీఫండ్ విధానాలను ప్రకటించింది. పర్మిట్ జారీ చేయని పక్షంలో షవ్వాల్ 14వ తేదీలోపు తమ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకున్న దేశీయ యాత్రికులకు పూర్తి మొత్తాన్ని వాపసు చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. అనుమతి జారీ అయిన తర్వాత షవ్వాల్ 15వ తేదీ తర్వాత, ధుల్ ఖదా ముగిసే వరకు తమ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే యాత్రికుల నుండి ఇ-సేవలకు రుసుముతో పాటు కాంట్రాక్ట్ విలువలో 10% మినహాయించబడుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. దుల్ హిజ్జా 1 తర్వాత చెల్లించిన మొత్తాన్ని తిరిగి పొందలేదు. ధుల్ హిజ్జా 1 తర్వాత మరణాలు, ఆరోగ్య పరిస్థితులు, క్రిమినల్ ప్రొసీడింగ్‌లు, ట్రాఫిక్ ప్రమాదాలు లేదా కోవిడ్-19 ఇన్ఫెక్షన్ వంటి తీవ్రమైన పరిస్థితుల కారణంగా హజ్ చేయకుండా నిరోధించబడిన యాత్రికులను రిఫండ్ విధానం నుండి మినహాయాంచారు. రుజువులు చూపితే చెల్లించిన పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. హజ్ పర్మిట్‌ను రద్దు అనేది తప్పనిసరిగా అబ్షర్ ప్లాట్‌ఫారమ్ ద్వారా చేయాలని, లేదా వెబ్సైట్, నుసుక్ యాప్ ద్వారా మాత్రమే రిజర్వేషన్‌ను రద్దు చేసుకోవాలని యాత్రికులకు మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







