సినిమా రివ్యూ: ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’
- March 17, 2023
నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. గతంలో రెండు సార్లు అవసరాల డైరెక్షన్‌లో వచ్చిన సినిమాల్లో నాగశౌర్య హీరోగా నటించాడు. అవే ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్చుతానంద’ సినిమాలు. కూల్ అండ్ రొమాంటిక్ హిట్లుగా నిలిచాయ్ ఈ రెండు సినిమాలు. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడో సారి పట్టాలెక్కిన ఈ హిట్ కాంబో హ్యాట్రిక్ కొడుతుందా.? లేదా.? తెలియాలంటే ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
సంజయ్ (నాగభౌర్య), అనుపమ (మాళవికా నాయర్) కాలేజీలో పరిచయమైన జంట. అమ్మాయి, అబ్బాయి కన్నా ఓ సంవత్సరం సీనియర్. సో, ర్యాగింగ్ కారణంగా వీరి మధ్య పరిచయం కాస్తా స్నేహంగా మారుతుంది. తర్వాతి కాలంలో ప్రేమగా పరిణీతి చెందుతుంది. పై చదువుల నిమిత్తం ఇద్దరూ లండన్ వెళతారు. అక్కడ వీరి మధ్య ప్రేమ, సహజీవనం వరకూ వెళుతుంది. అయితే, అనుకోని కారణాల వల్ల వీరి మధ్య బంధం బ్రేకప్ అవుతుంది. ఆ కారణం ఏంటీ.? ఆ తర్వాత మళ్లీ ఈ జంట కలుసుకున్నారా.? లేదా.? అనేది తెలియాలంటే సినిమా తెరపై చూడాల్సిందే.
నటీనటుల పని తీరు:
నాగశౌర్య, మాళవిక నాయర్ ఇద్దరూ సహజ నటీనటులే. తమవంతు తమ పాత్రలకు న్యాయం చేశారు. తన పాత్రలో మూడు దశల్లోనూ మూడు రకాల వేరియేషన్స్ చూపించడం కోసం నాగశౌర్య బాగా కష్టపడ్డాడు. ఆ కష్టం తెరపై కనిపిస్తుంది. తెరపై ఈ రెండు ప్రధాన పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయ్. అవసరాల పాత్ర గతంలో మాదిరి అంతగా ప్రాధాన్యత సంతరించుకోదు. మిగిలిన పాత్రల గురించి పెద్దగా చెప్పుకోవడానికి లేదు. అలా వచ్చి ఇలా వెళ్లిపోయే పాత్రలు మాత్రమే.
సాంకేతిక వర్గం పని తీరు:
ఆల్రెడీ అవసరాల డైరెక్షన్ అంటే ఫలానాగా వుండొచ్చని ఆడియన్స్‌కి ఓ అంచనా వుంది. ఆ అంచనాల్ని ఏమాత్రం మించిపోకుండా ఈ సినిమాని కూడా తెర మీద ఆవిష్కరించాడు అవసరాల శ్రీనివాస్ అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఈ సినిమాతో పూర్తిగా కొత్త ప్రయోగం చేశాడు అవసరాల. ఆ ప్రయోగంలో పూర్తిగా విఫలమయ్యాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. సహజత్వం.. పేరు చెప్పి సినిమా కాదు., ఓ డాక్యుమెంటరీని తెరకెక్కించాడు అవసరాల. తనదైన పంచ్ డైలాగులు.. కూల్ అండ్ లవ్లీ ఎట్మాస్మియర్ మనసుకు హత్తుకునే ఎమోషన్.. ఇలాంటివేమీ సినిమాలో ఎంత వెతికినా కనిపించవ్. బొత్తిగా నీరసం తెప్పించేశాడు.
నిర్మాణ విలువలు బాగున్నాయ్. సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే. ఎడిటింగ్‌లో కత్తెరలు పడితే బాగుండన్న సన్నివేశాలు చాలానే వుంటాయ్. కళ్యాణి మాలిక్ మ్యూజిక్ మాత్రం మనసుకు హత్తుకునేలా వుంటుంది. కానీ నేపథ్య సంగీతం సో సోగా వుంటుంది.
వివరణ:
అవసరాల గత చిత్రాలు ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్చుతానంద’ సినిమాల్లో ఏదో తెలియని మ్యాజిక్, డైలాగ్స్‌లో తెలియని ఛమక్కు వుంటాయ్. అవి ఆశించి ఈ సినిమాకి వెళితే, అత్యంత నిరాశే. అవసరాల మరీ ఇంతలా నీరసం కూడా తెప్పించగలడా.? అనేంతగా బోర్ కొట్టించేశాడు ‘పలానా అబ్బాయ్ ఫలానా అమ్మాయ్’. కథకు అత్యంత కీలకమైన ప్రేమికులు విడిపోవడానికి గల కారణాన్ని కూడా బలంగా తెరపై చూపించడంలో విఫలమయ్యాడు అవసరాల. అవసరాల మరీ ఇంతలా ఎందుకు చేశాడు.? అని డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు సినిమా చూసొచ్చిన ప్రేక్షకులు.
ప్లస్ పాయింట్స్:
నాగ శౌర్య, మాళవికా నాయర్ పర్‌ఫామెన్స్,
ద్వితీయార్ధంలో చాలా కొన్ని సన్నివేశాలు మాత్రమే.
మైనస్ పాయింట్స్:
కొత్తదనం లేని కథ, అస్సలు ఆకట్టుకోని పాత్రల చిత్రీకరణ, కథనం,
అనవసరమైన అవసరాల పాత్ర.. ఎక్స్‌ట్రా ఎక్స్‌ట్రా ఎక్స్‌ట్రా.. చాలా.
చివరిగా:
అనవసరంగా అవసరాల ప్రయోగం.! ఈ అమ్మాయి, అబ్బాయికి దారుణంగా బెడిసికొట్టిందిగా.!
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్‌లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!