‘కస్టడీ’తో చైతూ అనుకున్నది సాధించేనా.?
- March 17, 2023అక్కినేని నాగ చైతన్య సమ్మర్‌ని టార్గెట్ చేశాడు. ఆయన నటించిన ‘కస్టడీ’ సినిమా మే 12న రిలీజ్‌కి ముస్తాబయ్యింది. అందులో భాగంగానే వెరీ లేటెస్ట్గా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
స్టార్టింగ్ టు ఎండింగ్ టీజర్‌ని చాలా గ్రిప్పింగ్‌గా కట్ చేశారు. ‘గాయపడిన మనసు, యుద్ధం, ‘నిజం’ అనే ఆయుధం..’ అంటూ డైలాగ్స్‌లో చాలా పవర్ చూపించాడు నాగ చైతన్య.
కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో స్టైలిష్ విలన్ అరవింద్ స్వామి ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు. తెలుగుతో పాటూ తమిళంలోనూ రిలీజ్ అవుతోన్న ఈ సినిమాతో మాస్ హీరో అనిపించుకోవాలన్న చైతూ కోరిక నెరవేరుతుందేమో చూడాలి మరి.
వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకి ఇళయరాజా, ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు