కళ్యాణ్ రామ్ దర్శకుడు ఆ మెగా ఛాన్స్ నిజమేనా.?
- March 17, 2023
కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ సినిమా మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. కరోనా టైమ్‌లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటూ, బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. కలెక్షన్ల జోరు చూపించింది.
ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు వశిష్ట. ఆరంభమే బ్లాక్ బస్టర్ కావడంతో, ఈ నయా డైరెక్టర్ అందరి దృష్టినీ ఆకర్షించాడు. కేవలం ఆకర్షించడమే కాదు, తన వద్ద వున్న కథలతో స్టార్ హీరోలను సైతం ఇంప్రెస్ చేస్తున్నాడు.
ఆ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి ఓ కథ వినిపించాడట. తను నెరేట్ చేసిన విధానానికి చరణ్ ఇంప్రెస్ అయ్యాడట. కలిసి పని చేద్దాం అని హామీ ఇచ్చాడట. ప్రస్తుతం తాను చేస్తున్న శంకర్ సినిమా పూర్తి కాగానే, బుచ్చిబాబు సనతో ఓ సినిమా చేయాల్సి వుంది రామ్ చరణ్.
ఒకవేళ జరుగుతున్న ప్రచారమే నిజమైతే, బుచ్చిబాబు సినిమా తర్వాత వశిష్టతో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడేమో చరణ్ చూడాలి మరి.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







