మార్చి 28న కాస్మిక్ మిరాకిల్. ఒకేవరుసలో 5 గ్రహాలు
- March 18, 2023
యూఏఈ: మార్చి 28న ఆకాశంలో కాస్మిక్ మిరాకిల్ ఆకట్టుకోనుంది. గురు, బుధుడు, శుక్రుడు, యురేనస్ మరియు అంగారక గ్రహాలతో సహా ఐదు గ్రహాలు సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలోని ఒకే వరుసలో సందడి చేయనున్నాయి. ఐదు గ్రహాలలో, వీనస్ అత్యంత ప్రకాశవంతంగా ఉంటుందని, మెర్క్యురీ-బృహస్పతి హోరిజోన్ దగ్గరగా గమనించవచ్చని, కాగా యురేనస్ ను గుర్తించడం కొద్దిగా కష్టమని(బైనాక్యులర్లుతో చూడవచ్చు) నిపుణులు తెలిపారు. అయితే, ఐదు గ్రహాలు ఖచ్చితంగా ఒకే సరళ రేఖలో కనిపించవు కానీ.. ఒక ఆర్క్ ఆకారంలో (చంద్రునితో పాటు) ఆకాశంలో కనిపిస్తాయి. మార్చి 28న జరిగే ఈ ఖగోళ దృశ్యాన్ని పెద్ద గ్రహాల అలైన్ మెంట్ అంటారు. 5 నుండి 6 గ్రహాలు ఒకే సమయంలో సూర్యునికి ఒక వైపు దగ్గరగా ఉంటాయి. ఇలాంటిది చివరిసారిగా జూన్ 2022లో జరిగింది. మార్చి 28తోపాటు ఆకాశంలో గ్రహాల అలైట్ మెంట్ కనిపించే తేదీలను ఖగోళ నిపులు విడుదల చేశారు.
ఏప్రిల్ 11 - మెర్క్యురీ, యురేనస్, వీనస్, మార్స్
ఏప్రిల్ 24 - మెర్క్యురీ, యురేనస్, వీనస్, మార్స్
మే 29 - యురేనస్, మెర్క్యురీ, బృహస్పతి, శని
జూన్ 17 - మెర్క్యురీ, యురేనస్, బృహస్పతి, నెప్ట్యూన్, శని
జూలై 26 - మెర్క్యురీ, వీనస్, మార్స్
ఆగష్టు 24 – బుధుడు, అంగారక, శని గ్రహాలు ఒకే వరుసలో కనువిందు చేయనున్నాయి.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!