రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అరెస్ట్ వారెంట్
- March 18, 2023
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. యుక్రెయిన్ నుండి రష్యాకు పిల్లలను చట్టవిరుద్ధంగా బహిష్కరించడం సహా యుద్ధ నేరాలకు అతను బాధ్యుడని కోర్టు ఆరోపించింది. రష్యా తన పూర్తి స్థాయి దండయాత్రను ప్రారంభించిన 24 ఫిబ్రవరి 2022 నుండి ఉక్రెయిన్‌లో నేరాలు జరిగాయని తెలిపింది. దాడి సమయంలో యుద్ధ నేరాల ఆరోపణలను మాస్కో ఖండించింది.
పిల్లలను బహిష్కరించడంలో పుతిన్ ప్రమేయం ఉందని ఐసీసీ అభియోగాలు మోపింది. అతను నేరుగా ఈ చర్యలకు పాల్పడ్డాడని, అలాగే ఇతరులతో కలిసి పనిచేశాడని నమ్మడానికి సహేతుకమైన కారణాలు ఉన్నాయని పేర్కొంది. పిల్లలను బహిష్కరించే వారిని ఆపేందుకు తన హక్కులను వినియోగించుకోవడంలో పుతిన్ విఫలమయ్యాడని కోర్టు పేర్కొంది.
అరెస్ట్ వారెంట్లు అర్థరహితమని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా అన్నారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ నిర్ణయాలతో మన దేశానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. ఎందుకంటే వారెంట్లు ఉన్నప్పటికీ అనుమానితులను అరెస్టు చేసే అధికారాలు ఐసీసీకి లేవని స్పష్టం చేశారు. దాని ఒప్పందానికి సంతకం చేసిన దేశాలలో మాత్రమే అధికార పరిధిని అమలు చేయగలదని తెలిపారు. ఆ ఒప్పందంపై రష్యా సంతకం చేసిన దేశం కాదు కాబట్టి అరెస్టు వారెంట్లు ఇచ్చే అవకాశం లేదని చెప్పారు.
ఆ సందేశాన్ని Ms జఖరోవా పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ రోమ్ శాసనంలో రష్యా ఒక పార్టీ కాదని, దాని కింద ఎటువంటి బాధ్యతలను కలిగి ఉండదని తెలిపారు. జైలులో ఉన్న క్రెమ్లిన్ విమర్శకుడు అలెక్సీ నవల్నీ సన్నిహిత మిత్రుడు ఇవాన్ జ్దానోవ్ “వావ్!” అని ట్వీట్ చేయడాన్ని రష్యా ప్రతిపక్ష నాయకులు స్వాగతించారు.
ఈ నిర్ణయం ఉక్రెయిన్ మరియు మొత్తం అంతర్జాతీయ న్యాయ వ్యవస్థకు చారిత్రాత్మకం అని ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ ఆండ్రీ కోస్టిన్ అన్నారు. అయితే ఉక్రెయిన్ అధ్యక్ష చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆండ్రీ యెర్మాక్ ఈ నిర్ణయం ప్రారంభం మాత్రమే అని ప్రశంసించారు. లండన్‌లోని కింగ్స్ కాలేజ్ అంతర్జాతీయ రాజకీయాల్లో లెక్చరర్ అయిన జోనాథన్ లీడర్ మేనార్డ్ మాట్లాడుతూ పుతిన్‌పై అభియోగాలు మోపడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని అన్నారు.
మార్చి 2022 నుండి సాధ్యమైన మేర యుద్ధ నేరాలపై కోర్టు బహిరంగ విచారణ చేస్తోందని తెలిపారు. బలమైన సాక్ష్యాధారాలతో ఐసీసీ అరెస్టు వారెంట్లను జారీ చేయకుండా చివరికి ఎలా నివారించగలదో చూడటం కష్టమని అతను చెప్పాడు. అదే విధంగా పుతిన్ ఆరోపణలతో బాధపడే అవకాశం లేదని మిస్టర్ మేనార్డ్ పునరుద్ఘాటించారు.
ఎందుకంటే ప్రజలను అరెస్టు చేయడానికి వాస్తవానికి ఐసీసీ ప్రభుత్వాల సహకారంపై ఆధారపడుతుందని, రష్యా ప్రభుత్వం ఈ విషయంలో సహకరించదని చెప్పారు. ఐసీసీ సంతకం చేసిన ఇతర దేశాలు పుతిన్ ను అరెస్టు చేయడంలో సహకరిస్తాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా పర్యటించడానికి మిస్టర్ పుతిన్ స్వేచ్ఛపై ఇది ప్రభావం చూపుతుందని అతను చెప్పాడు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు