రమదాన్ సన్నద్దతను పరిశీలించిన మక్కా డిప్యూటీ ఎమిర్

- March 18, 2023 , by Maagulf
రమదాన్ సన్నద్దతను పరిశీలించిన మక్కా డిప్యూటీ ఎమిర్

మక్కా: మక్కాలోని గ్రాండ్ మస్జీదులో అమలవుతున్న ప్రణాళికలు, పనుల పురోగతిని మక్కా డిప్యూటీ ఎమిర్ ప్రిన్స్ బదర్ బిన్ సుల్తాన్ పరిశీలించారు. పవిత్ర రమదాన్ మాసంలో ఉమ్రా యాత్రికులు, ఆరాధకులను స్వీకరించడానికి పవిత్ర మస్జీదు సంసిద్ధతను సమీక్షించారు. ప్రిన్స్ బదర్ తన గ్రాండ్ మస్జీదు పర్యటనను ఇస్మాయిల్ గేట్ నుండి ప్రారంభించారు. ఇందులో మటాఫ్ దక్షిణ ముఖభాగంలో 10 మీటర్ల వెడల్పుతో మూడు ప్రవేశాలు ఉన్నాయి (ప్రదక్షిణలు పవిత్ర కాబా చుట్టూ ఉన్న ప్రాంతం). అనంతరం నిర్వహణ సంసిద్ధతను తెలుసుకునేందుకు మటాఫ్ పైకప్పుపైకి ఎక్కి పరిశీలించారు. ఒకేసారి 12,500 కంటే ఎక్కువ మంది ఆరాధకులకు వసతిని కల్పించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. తస్సోస్ పాలరాయితో శాశ్వత అంతస్తులతో నిర్మించిన పైకప్పును ఈ రమదాన్ లో మొదటిసారిగా ఆవిష్కరించనున్నారు. అనంతరం యాత్రికుల సంఖ్యను గంటకు 50,000 మంది యాత్రికుల నుండి గంటకు 107,000 మంది యాత్రికులకు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్న మతాఫ్ భవనం విస్తరణను ప్రిన్స్ బదర్ పరిశీలించారు.  యాత్రికులకు సేవలందించేందుకు 18,400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న మతాఫ్ భవనంలోని రెండవ మెజ్జనైన్ అంతస్తు ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనుల పురోగతిని డిప్యూటీ ఎమిర్ అడిగి తెలుసుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com