పర్యాటక రంగానికి కేంద్రంగా ఖతార్!
- March 18, 2023
దోహా: ప్రపంచ కప్ తర్వాత కూడా ఖతార్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గడం లేదు. దేశ పర్యాటక ప్రదేశాలు, సాంస్కృతిక ప్రాంతాలను అన్వేషించడానికి పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. దోహాలోని అన్ని ప్రధాన ఐకానిక్ స్థానాల్లో గత వారం ప్రపంచవ్యాప్తంగా సందర్శకులు కనిపించారు. సౌక్ వాకిఫ్, మ్షీరెబ్, కార్నిచ్, ది పర్ల్‌లోని హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్‌లు కొన్ని అరేబియా వంటకాలు, దేశంలోని వంటకాల ప్రత్యేకతలను ప్రశాంత వాతావరణంలో ఆస్వాదించడానికి అతిథులను స్వాగతిస్తున్నాయి. వాస్తవానికి పర్యాటక గమ్యస్థానంగా ఉన్న ఖతార్.. సాకర్ ఆటలతో ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. అంతకుముందు వాణిజ్య హబ్ గా ఉన్న ఖతార్.. ఇప్పుడు పర్యాటకంగా కూడా ఉత్తమ గమ్యస్థానంగా మారిందని ఈ రంగంలోని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా సౌక్ వాకిఫ్ సాంప్రదాయ వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, హస్తకళలు, సావనీర్‌లు, ప్రపంచ ప్రఖ్యాత రెస్టారెంట్‌లు, షిషా లాంజ్‌లకు ఖతార్ నిలయం మారిందని చెబుతున్నారు. గత సీజన్‌తో పోలిస్తే క్రూయిజ్ షిప్ రాకపోకలు కూడా పెరిగాయని దోహా బస్ జనరల్ మేనేజర్ తారెక్ అమోరా తెలిపారు. ఖతార్‌లో పర్యటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికుల ఊపందుకున్నాయని, రాబోయే రోజుల్లో పర్యాటకులకు అనేక ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. దోహా బస్ ఖతార్‌లోని ప్రముఖ డెస్టినేషన్ మేనేజ్‌మెంట్ కంపెనీ. ఇది పర్యాటకం, ఆతిథ్యం సేవలను అందిస్తుంది. 2013లో స్థాపించబడిన ఈ సంస్థ.. హాప్ ఆన్ హాప్ ఆఫ్ టూర్ ప్రొవైడర్‌గా ప్రారంభమైన ప్రైవేట్ యాజమాన్యంలోని సంస్థ.. క్రమంగా టూరిజం, హాస్పిటాలిటీ పరిశ్రమలో వేగంగా అభివృద్ధి చెందింది.
తాజా వార్తలు
- టీసీఎస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..
- బైబ్యాక్ ఆప్షన్, సర్వీస్ ఛార్జీలు లేవు: దుబాయ్ డెవలపర్లు..!!
- రియాద్‌లో వ్యభిచారం చేస్తున్న ముగ్గురు ప్రవాస మహిళల అరెస్ట్..!!
- దుబాయ్ లూప్: ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి హై-స్పీడ్ భూగర్భ రవాణా వ్యవస్థ..!!
- ఫిబ్రవరి 21-22 తేదీలలో ఒమన్ మస్కట్ మారథాన్ 2025..!!
- ఎండోమెంట్ కంపెనీల స్థాపన, లైసెన్సింగ్‌పై అబుదాబిలో కొత్త నియమాలు..!!
- రమదాన్ ముందు తనిఖీలు.. షువైఖ్‌లోని తొమ్మిది దుకాణాలకు జరిమానా..!!
- టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని కలిసిన హోమ్ మంత్రి అనిత
- హైదరాబాద్ విమానాశ్రయంలో అధునాతన ల్యాండింగ్ సదుపాయాలు!
- మీరు పోస్టాఫీసులో రోజుకు రూ.50 పెట్టుబడి పెడితే చాలు..