యూఏఈ ఆన్ అరైవల్ వీసా: 50 దేశాల పౌరులకు 30 రోజుల వీసా

- March 18, 2023 , by Maagulf
యూఏఈ ఆన్ అరైవల్ వీసా: 50 దేశాల పౌరులకు 30 రోజుల వీసా

యూఏఈ: 50 కంటే ఎక్కువ దేశాల పౌరులు యూఏఈలోకి ప్రవేశించిన తర్వాత 30 రోజుల వీసాను అందుకోవచ్చు. దీనిని 10 రోజుల పాటు పొడిగించవచ్చు లేదా 90 రోజుల వీసా ఆన్ అరైవల్ పొందవచ్చు. అయితే, ఇతర దేశాల పౌరులు మాత్రం యూఏఈకి రాకముందే ప్రవేశ అనుమతిని పొందవలసి ఉంటుంది. ఎవరైనా దానిని స్పాన్సర్ చేయవలసి ఉంటుందని యూఏఈ డిజిటల్ గవర్నమెంట్ (డిజివో) పేర్కొంది. జీసీసీ దేశాల పౌరులకు వీసా లేదా పర్మిట్ అవసరం లేదని లేదా యూఏఈలోని జాతీయ లేదా నివాసి స్పాన్సర్ చేయాల్సిన అవసరం లేదని కూడా వివరించింది. వారు యూఏఈలోకి ప్రవేశించే సమయంలో వారి జీసీసీ కంట్రీ పాస్‌పోర్ట్ లేదా జాతీయ ID కార్డ్‌ను సమర్పించాలని పేర్కొంది.

"విజిట్ దుబాయ్" వెబ్‌సైట్ ద్వారా 50 కంటే ఎక్కువ దేశాల పౌరులు 30 రోజులు లేదా 90 రోజుల పాటు వీసా ఆన్ అరైవల్‌తో దుబాయ్‌ని సందర్శించవచ్చని సూచించారు. ఎవరైనా https://www.visitdubai.com ద్వారా యూఏఈ వీసా కోసం అతని/ఆమె అర్హతను చెక్ చేసుకోవచ్చని తెలిపారు. సాధారణ పాస్‌పోర్ట్, యూఎస్ఏ జారీ చేసిన విజిట్ వీసా లేదా అమెరికా జారీ చేసిన గ్రీన్ కార్డ్ లేదా యూకే జారీ చేసిన నివాస వీసా లేదా ఈయూ జారీ చేసిన నివాస వీసా కలిగి ఉన్న భారతీయ పౌరులు వీసాను పొందవచ్చని వివరించింది. వీసాలు లేదా గ్రీన్ కార్డ్ యూఏఈకి చేరిన తేదీ నుండి కనీసం ఆరు నెలల వరకు చెల్లుబాటులో ఉంటుందని.. అదనంగా 14 రోజులు పొడిగించవచ్చని తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com