జీరా (జీలకర్ర)తో ఆరోగ్యం ఈజీగా.!
- March 18, 2023
జీరా అదేనండీ జీలకర్రకు పురాతన చరిత్రే వుంది. పురాతన కాలం నుంచీ ఆయుర్వేద మూలికల్లో జీలకర్రకు ప్రత్యేకమైన స్థానం వుంది.
పరగడుపున జీలకర్ర నీటిని తాగితే, కడుపుబ్బరం, జీర్ణ సంబంధిత సమస్యలు దరి చేరవు. ఎలంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆహార పదార్ధం జీలకర్ర. రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
అజీర్ణం, విరేచనాలు, వికారాల వంటి అన్‌ఈజీ సమస్యల నుంచి ఉపశమనం అందిస్తుంది. బరువు తగ్గడంలోనూ జీలకర్రకు ప్రాధాన్యత వుందండోయ్.
ప్రతీ రోజూ ఖాళీ కడుపుతో జీలకర్ర రసంలో కాస్త నిమ్మ రసం, నల్ల ఉప్పు చేర్చి తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయట.
అంతేకాదు, పండగల సమయాల్లో అధిక ఆహారం తీసుకోవడం వల్ల, రాత్రికి కడుపుబ్బరంగా అనిపిస్తుంది. అలా కాకుండా వుండాలంటే, ఆ రోజు ఉదయమే కాస్త జీలకర్ర రసం తీసుకుంటే, అది జీవక్రియను క్రమబద్ధీకరిస్తుంది.
తాజా వార్తలు
- క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్ సహా సరికొత్త ఆర్థిక నేరాలపై ఫోకస్: డీజీపీ అంజనీ కుమార్
- ముగిసిన హెచ్-1బీ వీసా అప్లికేషన్లు..
- మెక్సికో నగరంలో ఘోర అగ్నిప్రమాదం..39 మంది మృతి
- హైదరాబాద్ లో ఆస్కార్ విజేత చంద్రబోస్కు సత్కారం..
- జీ-20 సదస్సు-2023కు విశాఖ రెడీ
- ప్రజాగ్రహంతో దిగొచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని..
- హైదరాబాద్ నగరాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు కృషి
- పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు..
- అదనపు ఆదాయాన్నిచ్చే ‘సెకండ్ శాలరీ’..!
- ఆకాశంలో కనువిందు చేయనున్న 5 గ్రహాలు..!