కేజీఎఫ్ భామకి కోపమొచ్చింది.! అందుకే క్లారిటీ ఇచ్చేసింది.!
- March 18, 2023‘కేజీఎఫ్’ హీరో యష్ మంచివాడు కాదనీ, అతనితో మళ్లీ పని చేయనని ఆ సినిమా హీరోయిన్ శ్రీనిధి శెట్టి తెగేసి చెప్పినట్లు ఓ ట్వీట్ నెట్టింట ఈ మధ్య స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ ప్రచారంపై యష్ ఫ్యాన్స్ చాలా గుస్సా అవుతున్నారు. అయితే, తాజాగా ఈ ప్రచారంపై స్పందించింది ‘కేజీఎఫ్’ బ్యూటీ శ్రీనిధి శెట్టి. కొందరు పని లేని వ్యక్తులే ఇలాంటి ట్వీట్లు చేస్తుంటారు. సోషల్ మీడియాని మిస్ యూజ్ చేస్తుంటారు.. ‘యష్ చాలా మంచివాడు.. అతనితో కలిసి పని చేయడం నిజంగా నా అదృష్టం.. మళ్లీ ఆయనతో కలిసి పని చేసే ఛాన్స్ ఎప్పుడొస్తుందా.? అని మనస్సూర్తిగా ఎదురు చూస్తున్నా.. అని ట్వీట్ చేసి ఈ దుస్ప్రచారానికి చెక్ పెట్టేసింది.
ఇంతకీ ఆ ట్వీట్ వైరల్ చేసిందెవరో కాదు, రాబోయే సినిమాలకు ముందుగానే తనదైన శైలిలో రివ్యూలు ఇచ్చేసి సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఉమర్ సంధు. ఆయనకే శ్రీనిధి శెట్టి గట్టిగా కౌంటర్ ఇచ్చిందన్న మాట.
తాజా వార్తలు
- అల్ బురైమిలో డ్రగ్స్.. ప్రవాసుడు అరెస్టు..!!
- నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్ ప్రారంభించిన కింగ్ సల్మాన్..!
- యూఏఈ నివాసితులు జీవితాన్ని మార్చేసిన వీసా క్షమాభిక్ష..!!
- చెల్లింపు లింక్ల కోసం కొత్త స్క్రీన్.. కువైట్ సెంట్రల్ బ్యాంక్..!!
- హమద్ పోర్ట్లో 1,700 కిలోల నిషేధిత పదార్థం సీజ్..!!
- బహ్రెయిన్ లో మరో 15 ట్రాఫిక్ సర్వీసులు డిజిటైజ్..!!
- లడ్డు బాధ్యుల పై చర్యలు: డిప్యూటీ సీఎం పవన్
- తిరుమల లడ్డూ వివాదం..హైకోర్టులో వైసీపీ పిటిషన్
- ఏపీ: నేటి నుంచి ఆన్లైన్లో ఇసుక బుకింగ్.. అందుబాటులోకి పోర్టల్
- అల్ మక్తూమ్ బ్రిడ్జి.. జనవరి 16 వరకు తాత్కాలికంగా మూసివేత..!!