జీరా (జీలకర్ర)తో ఆరోగ్యం ఈజీగా.!
- March 18, 2023జీరా అదేనండీ జీలకర్రకు పురాతన చరిత్రే వుంది. పురాతన కాలం నుంచీ ఆయుర్వేద మూలికల్లో జీలకర్రకు ప్రత్యేకమైన స్థానం వుంది.
పరగడుపున జీలకర్ర నీటిని తాగితే, కడుపుబ్బరం, జీర్ణ సంబంధిత సమస్యలు దరి చేరవు. ఎలంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆహార పదార్ధం జీలకర్ర. రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
అజీర్ణం, విరేచనాలు, వికారాల వంటి అన్ఈజీ సమస్యల నుంచి ఉపశమనం అందిస్తుంది. బరువు తగ్గడంలోనూ జీలకర్రకు ప్రాధాన్యత వుందండోయ్.
ప్రతీ రోజూ ఖాళీ కడుపుతో జీలకర్ర రసంలో కాస్త నిమ్మ రసం, నల్ల ఉప్పు చేర్చి తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయట.
అంతేకాదు, పండగల సమయాల్లో అధిక ఆహారం తీసుకోవడం వల్ల, రాత్రికి కడుపుబ్బరంగా అనిపిస్తుంది. అలా కాకుండా వుండాలంటే, ఆ రోజు ఉదయమే కాస్త జీలకర్ర రసం తీసుకుంటే, అది జీవక్రియను క్రమబద్ధీకరిస్తుంది.
తాజా వార్తలు
- రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
- ఎయిరిండియా సిబ్బంది మూకుమ్మడిగా సెలవు..
- జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్దొద్దు: కోర్టును కోరిన సీబీఐ
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లకు మంచి రోజులు..!
- జహ్రా గవర్నర్‌ను కలిసిన భారత రాయబారి
- 66కు పెరిగిన సౌదీ ఇ-విజిట్ వీసా పూల్ దేశాలు
- దుబాయ్‌లో కొత్త ట్రాఫిక్ ప్లాన్ కు ఆమోదం
- క్యాబిన్ క్రూ సంక్షోభం.. తగ్గనున్న ఎయిర్ ఇండియా సర్వీసులు..!
- షేక్ హజ్జా బిన్ సుల్తాన్ బిన్ జాయెద్ మృతికి సంతాపం తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!