రోడ్డుపై దొరికిన Dh 110,000 నగదును పోలీసులకు అప్పగించిన ప్రవాసుడు
- March 19, 2023
దుబాయ్: బహిరంగ ప్రదేశంలో దొరికిన భారీ మొత్తంలో నగదును అందజేసినందుకు ఒక ఫ్రెంచ్ ప్రవాసి లుక్ జియాద్ మజ్దలానీని దుబాయ్‌లో పోలీసులు సన్మానించారు. మజ్దలాని రోడ్డుపై దొరికిన Dh110,000 విలువైన నగదును నేరుగా అల్ ఖుసైస్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అప్పగించారు. ఈ సందర్భంగా ప్రవాసిని సన్మానించిన అల్ ఖుసైస్ పోలీస్ స్టేషన్ యాక్టింగ్ డైరెక్టర్ కల్నల్ సుల్తాన్ అబ్దుల్లా అల్ ఒవైస్.. మజ్దలానీ నిజాయితీని ప్రశంసించారు. పౌర కర్తవ్యాన్ని మజ్దలానీ మరోసారి నిరూపించారని మెచ్చుకున్నారు. పోలీసు అధికారి మజ్దలానీకి ప్రశంసా పత్రం, దుబాయ్ పోలీసుల ప్రివిలేజ్ కార్డ్ 'ఈసాద్'ని అందించారు. పోలీసులకు మజ్దలానీ ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







