మెస్సీ అభిమానికి ఇంటిని బహుమతిగా ఇచ్చిన దుబాయ్ వ్యాపారవేత్త
- March 20, 2023
యూఏఈ: కేరళలోని ఒక రైతుకు ఫుట్‌బాల్ ఆకారంలో ఉన్న ఇంటిని దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త బహుమతిగా ఇచ్చారు. ఫుట్‌బాల్ ఆటపై తనకున్న గాఢమైన ప్రేమకు గౌరవసూచకంగా దుబాయ్‌లోని స్మార్ట్ ట్రావెల్ యజమాని అఫీ అహ్మద్ ఈ బ్లూ అండ్ వైట్ హోమ్ కీలను గత వారం జుబైర్ వజక్కద్(రైతు)కు అందజేశారు. ఖతార్‌లో జరిగిన ఫిఫా ప్రపంచ కప్ సమయంలోనే జుబైర్ ప్రతి గేమ్‌ను తనదైన స్టయిల్ లో పరిపూర్ణ విశ్లేషణతో కేరళలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. ఫుట్‌బాల్ అభిమాని అయిన జుబైర్ కు 1904 నుండి జరిగిన ప్రతి ఫిఫా ప్రపంచ కప్ గేమ్‌కు సంబంధించిన గణాంకాలను నోటిపై చెప్పగలడు. జుబైర్ వజక్కద్ గురించి తెలుసుకున్న అఫీ అహ్మద్.. ఫుట్ బాల్ ప్రపంచ కప్ ను ప్రత్యక్షంగా చూసేందుకు వీలుగా ఖతార్ కు తీసుకువస్తానని ప్రతిపాదించారు. అయితే తన తల్లి అనారోగ్యంతో ఉన్నందున ఖతార్ వచ్చేందుకు జుబైర్ నిరాకరించాడు. ఆ సమయంలో తాను అతని కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నట్లు అఫీ అహ్మద్ తెలిపారు. అతని అభిరుచి మేరకు ఫుట్ బాల్ ఇంటిని నిర్మించి ఇచ్చినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు