ఐకానిక్ గోల్డ్.! ఉత్తమ నటుడు నిఖిల్ సిద్దార్ద్.!

- March 20, 2023 , by Maagulf
ఐకానిక్ గోల్డ్.! ఉత్తమ నటుడు నిఖిల్ సిద్దార్ద్.!

యంగ్ స్టార్ నిఖిల్ సిద్దార్ద్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది ‘కార్తికేయ 2’. అంతేకాదు, ఈ సినిమాతో నిఖిల్, ప్యాన్ ఇండియా స్టార్‌గా కూడా గుర్తింపు దక్కించుకున్నాడు.
తెలుగుతో పాటూ, ఇతర భాషల్లో ముఖ్యంగా హిందీలో ఈ సినిమాకి మంచి ఆదరణ దక్కింది. కృష్ణుడి తత్వాన్ని మెయిన్ హైలైట్‌గా చూపించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ విశేషంగా ఆకట్టుకుంది.
బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కాసుల పంట పండించింది. ఇస్కాన్ ప్రశంసలు కూడా దక్కించుకున్న సినిమాగా హిస్టరీలో నిలిచింది. తాజాగా ఐకానిక్ గోల్డ్ 2023 ప్రకటించిన అవార్డుల్లో ఉత్తమ నటుడి అవార్డును నిఖిల్ సిద్ధార్ద్ దక్కించుకున్నాడు ‘కార్తికేయ 2’ సినిమాకి గాను.
ఈ అవార్డు దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నాడు నిఖిల్ సిద్దార్ధ్. ప్రస్తుతం నిఖిల్ ‘స్పై’ సినిమాతో బిజీగా వున్నాడు. రీసెంట్‌గా ‘18 పేజెస్’ సినిమాతో మరో హిట్‌నీ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే యంగ్ హ్యాండ్‌సమ్ నిఖిల్ సిద్దార్ధ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com