పాపం....పీపాలో పాప
- May 06, 2016
పారిశ్రామిక ప్రాంతంలోని 1 వ వీధిలో గురువారం ఒక ఏడాది వయస్సు ఉన్న పాకిస్తానీ పసిబిడ్డ తన కుటుంబం యొక్క స్నానాల గదిలో ఉన్న ఒక నీటి పీపా లోనికి ఎగబాకి అందులోనికి దిగి మునిగిపోయి మరణించాడు.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, ఈ పసిబిడ్డ నేలపై పాకుతూ స్నానాల గదిలోనికి వెళ్ళాడు అక్కడ నీటితో నిండి ఉన్నపీపా లోనికి దిగే యత్నంలో అకస్మాతుగా మునిగిపోయాడు. కొద్ది సేపటి తర్వాత తల్లి బకెట్ లో అపస్మారక స్థితిలో ఉన్న తన చిన్నారిని చూసి ఏడుపులు పెడబొబ్బలతో అంబులెన్స్ ని పిలచి
అల్ క్యసిమి హాస్పిటల్ తరలించారు. వైద్య సిబ్బంది తమ వంతు కృషి చేసినప్పటికీ శిశువు ఆసుపత్రికి చేరుకొన్న 30 నిమిషాలలో మరణించాడు . పోలీసులు కేసు విచారణ ప్రారంభించి ఈ పిల్లవాని మృతిపై ఇంకేమైనా కారణం ఉందేమోనని తెల్సుకోనేందుకు తల్లిదండ్రులను ప్రశ్నించారు.
తాజా వార్తలు
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- 'చెక్ యువర్ హెల్త్' క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..
- లండన్లో అగ్నిప్రమాదం..తెలుగు యువకుడు మృతి









