చెల్లుబాటు వీసాలు లేనివారికి సహాయం చేయొద్దు.. నివాసులకు హెచ్చరిక
- March 22, 2023
సౌదీ: చెల్లుబాటు అయ్యే వీసాలు లేని వారికి సహాయం చేయవద్దని సౌదీ అరేబియా ప్రభుత్వం దేశంలో నివాసితులు, యజమానులను హెచ్చరించింది. ఈ మేరకు పబ్లిక్ సెక్యూరిటీ అథారిటీ ఓ ప్రకటనను విడుదల చేసింది. వీసాల నిబంధనలను ఉల్లంఘించేవారికి ఉపాధి కల్పించడం, నివాసం కల్పించడం, సహాయం చేయడం వంటివి చేయకూడదని నివాసితులను కోరింది. ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘించేవారికి SAR100,000 జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించబడుతుందని హెచ్చరించింది. శిక్ష అనుభవించిన తర్వాత వారిని దేశం నుంచి బహిష్కరిస్తామని స్పష్టం చేసింది. అదే విధంగా తగిన వీసా లేని వ్యక్తిని నియమించుకున్న యజమానికి SAR100,000 వరకు జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించబడుతుందని ప్రకటనలో తెలిపింది. దీంతోపాటు సందరు యజమానులు ఆరు నెలల పాటు రిక్రూట్మెంట్పై నిషేధం విధిస్తామని పేర్కొంది. మక్కా అల్-ముకర్రామా, రియాద్, తూర్పు ప్రావిన్స్‌లో (911).. దేశంలోని మిగిలిన ప్రాంతాలలో (999) కాల్ చేయడం ద్వారా నిబంధనలు ఉల్లంఘించిన వారి గురించి నివేదించాలని ప్రజలకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- కొత్త క్యాంపస్ ఏపీలో...12,000 కొత్త ఉద్యోగాల అవకాశాలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్‌లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్‌గ్రౌండ్‌లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం