అబుధాబిలో పెయిడ్ పార్కింగ్ అవర్స్, టోల్ గేట్ సమయాలు
- March 23, 2023
యూఏఈ: అబుధాబిలోని మునిసిపాలిటీలు, రవాణా శాఖకు చెందిన ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ (ITC) పవిత్ర రమదాన్ (1444 హిజ్రీ) సందర్భంగా పెయిడ్ పార్కింగ్ అవర్స్, టోల్ గేట్ సమయాలు, పబ్లిక్ బస్సు షెడ్యూల్లను ప్రకటించింది. పార్కింగ్ రుసుములు రమదాన్ రంజాన్ సందర్భంగా సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:00 నుండి అర్ధరాత్రి వరకు ప్రస్తుత సమయం ప్రకారం వర్తిస్తాయి. కాగా ఆదివారాల్లో మాత్రం ఉచితం సౌకర్యాన్ని కల్పించారు. రమదాన్ సందర్భంగా ఉదయం 8:00 నుండి 10:00 వరకు.. సాయంత్రం 2:00 నుండి 4:00 గంటల వరకు దర్బ్ టోల్ గేట్ సిస్టమ్ పీక్ అవర్స్ ని సవరించారు. టోల్ ఛార్జీలు సోమవారం నుండి శనివారం వరకు వర్తింపజేయనున్నారు. ఆదివారాలు ఉచితంగా ఉంటాయి.
పబ్లిక్ బస్సు సర్వీసులు
రమదాన్ మాసంలో అబుధాబి నగరం దాని శివారు ప్రాంతాలలో వారం పొడవునా పబ్లిక్ బస్సు సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ సేవలు అబుధాబి నగరంలో ఉదయం 5:00- 6:00 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1:00 గంటల వరకు కొనసాగుతాయి. అబుధాబి శివారు ప్రాంతాల విషయానికొస్తే.. ఈ సేవలు ఉదయం 6:00 నుండి రాత్రి 10:00 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.
అల్ ఐన్ నగరం విషయానికొస్తే.. రమదాన్ సందర్భంగా పబ్లిక్ బస్సు సర్వీసులు ఉదయం 7:00 నుండి తెల్లవారుజామున 2:00 వరకు పనిచేస్తాయి. దాని శివారు ప్రాంతాలకు సంబంధించి సేవలు ఉదయం 6:00 నుండి రాత్రి 11:00 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. కొన్ని సేవలు అర్ధరాత్రి వరకు పనిచేస్తాయి.
రమదాన్ సందర్భంగా అల్ దఫ్రాలో పబ్లిక్ బస్సు సర్వీసుల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఇఫ్తార్ సమయంలో పబ్లిక్ బస్సు సర్వీసులు అందుబాటులో ఉండవు. అబుధాబి ఎక్స్ప్రెస్ సర్వీసుల విషయానికొస్తే, ఈ సర్వీస్ వారాంతపు రోజులలో ఉదయం 6:00 నుండి రాత్రి 11:00 వరకు.. వారాంతాల్లో ఉదయం 6:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు నడుస్తాయి. ఆన్-డిమాండ్ బస్సు “అబుధాబి లింక్” సేవ వారం మొత్తం ఉదయం 06:00 నుండి రాత్రి 11:00 వరకు అందుబాటులో ఉంటుంది.
కస్టమర్ హ్యాపీనెస్ కేంద్రాలు
అబుధాబి సిటీ మునిసిపాలిటీ, అల్ ఐన్ సిటీ మునిసిపాలిటీలోని కస్టమర్స్ హ్యాపీనెస్ సెంటర్లు పవిత్ర రమదాన్ మాసంలో సోమవారం నుండి గురువారం వరకు ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 3:00 వరకు.. శుక్రవారం ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం వరకు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!