చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో రషీద్ రోవర్..!

- March 23, 2023 , by Maagulf
చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో రషీద్ రోవర్..!

బహ్రెయిన్: చంద్రుని ఉపరితలంపైకి దిగిన మొదటి ఎమిరాటీ రోవర్ గా రషీద్ రోవర్ చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో ఉంది. రషీద్ రోవర్ ని విజయవంతంగా చంద్రుని కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు మొహమ్మద్ బిన్ రషీద్ అంతరిక్ష కేంద్రం (MBRSC) వెల్లడించింది.  రషీద్ రోవర్‌ను మోసుకెళ్తున్న ఐస్పేస్ ల్యాండర్ ను ఇంజనీర్ల ఆధ్వర్యంలో మార్చి 21న యూఏఈ సమయం ప్రకారం.. ఉదయం 5.24 గంటలకు మిషన్ ఆపరేషన్ ప్లాన్‌కు అనుగుణంగా మొదటి చంద్రుని కక్ష్యలోకి ప్రవేశపెట్టే  ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం.. రషీద్ రోవర్ ఏప్రిల్ చివరిలో చంద్రునిపై దిగనుంది. అయితే, కచ్చితమైన ల్యాండింగ్ తేదీ, సమయంపై కొద్ది రోజుల్లో మరింత స్పష్టం వస్తుందని అంతరిక్ష కేంద్రం ప్రకటించింది. చంద్రుని ఉపరితలాన్ని అధ్యయనం చేయడానికి యూఏఈ చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక మిషన్ భవిష్యత్తులో ఇతర గ్రహాల అన్వేషణకు గేట్‌వేగా ఉపయోగపడుతుందని నిపుణులు తెలిపారు. ఈ మిషన్‌కు టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ అథారిటీ (TDRA) ICT ఫండ్ నిధులు సమకూరుస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com