40ల్లో అడుగు పెడుతోన్న మహిళలూ.! ఈ లక్షణాలు మీలో గుర్తించారా.?
- March 23, 2023
40 ఏళ్లు ఆ పై వయసు దాటిన మహిళల్లో అనేక ఆరోగ్య సమస్యలు దాడి చేస్తుంటాయ్. ముఖ్యంగా ఈ వయసు మహిళల మెనోపాజ్కి దగ్గర చేస్తుంది. దాంతో, హార్మోన్ల అసమతుల్యత.. అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదాలు పొంచి వుంటాయ్. ఆయా రకాల వ్యాధులు ఎటాక్ చేసే ముందే కొన్ని లక్షణాలు హెచ్చరిస్తుంటాయ్.
వాటిలో ముఖ్యమైనది ముందుగా అధిక నీరసం. ఎముకలు బలహీనపడడం. ఇతరత్రా ఆర్ధరైటిస్ సమస్యలు, అధిక రక్తపోటు, ఊబకాయం మొదలైనవి.
అధిక రక్తపోటు కారణంగా గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయ్. అలాగే మూత్ర పిండాల సమస్య కూడా. అధిక రక్తపోటును అస్సలు అశ్రద్ధ చేయకుండా ముందుగానే గుర్తించి జాగ్రత్త తీసుకుంటే ప్రాణాంతక సమస్యల బారిన పడకుండా చూసుకోవచ్చు.
40లు దాటిన మహిళల్లో పెరి మెనోపాజల్ హార్మోన్లు మందకొడిగా వుండడంతో ఊబకాయ సమస్య తలెత్తుతుంది. ఊబకాయం విషయంలో మహిళలు చాలా జాగ్రత్తగా వుండాలి.
40ల తర్వాత ఎముకల్లో బలం తగ్గిపోతుంది. హార్మోన్లలో మార్పుల కారణంగా ఎముకల ఆరోగ్యం దెబ్బ తినే ప్రమాదముంది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే, కాల్షియం, విటమిన్ డి స్థాయిుల తగిన మోతాదులో వుండేలా చూసుకోవాలి.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







