అతిపెద్ద సైబర్ స్కామ్‌ను బయటపెట్టిన సైబరాబాద్ పోలీసులు
- March 23, 2023
హైదరాబాద్: భారత దేశంలోనే అతి పెద్ద డేటా చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు బయటపెట్టారు. 16.8 కోట్ల మంది దేశపౌరుల డేటా చోరీకి గురైనట్లు తెలిపారు. ఇందులో డిఫెన్స్, ఆర్మీ ఉద్యోగులకు చెందిన సెన్సిటివ్ డేటా సైతం అమ్మకానికి పెట్టినట్లు గుర్తించారు. ఇన్యూరెన్స్, లోన్ల కోసం అప్లై చేసిన 4లక్షల మంది డేటాతో పాటు, 7లక్షల మంది ఫేస్బుక్ ఐడీ, పాస్‌వర్డ్‌లను కూడా దొంగిలించారు. పలు వెబ్సైట్ల నుంచి చోరీ చేసిన డేటాను.. సైబర్ నేరగాళ్లకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలో ఆరుగురు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
దేశ భద్రతకు భంగం కలిగేలా సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత డేటాను అపహరిస్తున్నారని సీపీ తెలిపారు. బీమా, లోన్లకు అప్లై చేసిన నాలుగు లక్షల మంది డేటా చోరీకి గురైందన్నారు. కోట్లాదిగా సోషల్ మీడియా ఐడీలు, పాస్వర్డ్లు కూడా లీకైనట్లు గుర్తించామన్నారు. ఇక ఆర్మీకి చెందిన రెండున్నర లక్షల మంది డేటా, ఢిల్లీలో 35 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల డేటా చోరీకి గురైందని పేర్కొన్నారు. కేటుగాళ్లు ఇన్సూరెన్స్, క్రెడిట్‌కార్డులు, లోన్ అప్లికేషన్ల నుంచి వివరాల సేకరిస్తున్నట్లు గుర్తించారు. డేటా చోరీ గ్యాంగ్‌లకు ఆయా కంపెనీల్లో కొందరు ఉద్యోగులు సాయం చేసినట్లు వెల్లడించారు.సెక్యూరిటీ ఉందనుకున్న బ్యాంక్ అకౌంట్ల నుంచి కూడా నేరగాళ్లు చోరీలకు పాల్పడ్డారు. సేకరించిన వ్యక్తిగత డేటాను విచ్చలవిడిగా అమ్మేస్తున్నారని సీపీ తెలిపారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







